Begin typing your search above and press return to search.

ప్రభాస్ నమ్మితే ఇలా ఉంటది మరి..

తద్వారా షూటింగ్ వేగంగా పూర్తయిపోతుంది. ప్రభాస్ స్టార్ డైరెక్టర్స్ తో పాటు, యంగ్ డైరెక్టర్స్ ని కూడా ఒకే రీతిలో రెస్పెక్ట్ చేస్తూ వారికి ఏం కావాలో అది చేయడం పైన దృష్టి పెట్టారంట.

By:  Tupaki Desk   |   24 Sep 2024 2:30 AM GMT
ప్రభాస్ నమ్మితే ఇలా ఉంటది మరి..
X

డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం దేశంలోనే అత్యధిక మార్కెట్ వేల్యూ ఉన్న స్టార్ గా కొనసాగుతున్నాడు. ‘కల్కి2898ఏడీ’ మూవీతో ఈ ఏడాది 1100+ కోట్ల కలెక్షన్స్ ని ప్రభాస్ తన ఖాతాలో వేసుకున్నారు. ఇండియాలో ఈ ఏడాది హైయెస్ట్ కలెక్షన్స్ వసూళ్లు చేసిన చిత్రంగా ‘కల్కి2898ఏడీ’ మూవీ నిలిచింది. ఈ సినిమాతో ప్రభాస్ సినిమాల మార్కెట్ వేల్యూ 500 కోట్లు దాటిపోయింది. అలాగే ఆయన సినిమాలపై కూడా నిర్మాతలు 400-500 కోట్ల బడ్జెట్ ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతున్నారు.

ప్రస్తుతం ప్రభాస్ లైనప్ లో మారుతి దర్శకత్వంలో చేస్తోన్న ‘ది రాజాసాబ్’, హను రాఘవపూడి ‘ఫౌజీ’, సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ సినిమాలు ఉన్నాయి. వీటితో పాటు నాగ్ అశ్విన్ తో ‘కల్కి పార్ట్ 2’, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్ పార్ట్ 2’ చిత్రాలు ప్రభాస్ పూర్తి చేయాల్సి ఉంది. ప్రభాస్ కచ్చితంగా ఏడాదికి ఒకటి, రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చి ఏడాది ది రాజాసాబ్ థియేటర్స్ లోకి రాబోతోంది.

అయితే బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ చేస్తోన్న ప్రభాస్ డైరెక్టర్స్ కి పూర్తిగా క్రియేటివ్ ఫ్రీడమ్ ఇస్తున్నాడనే మాట వినిపిస్తోంది. కంటెంట్ లో ప్రభాస్ అస్సలు జోక్యం చేసుకోవడం లేదని టాక్. మరో వైపు తాను లేని సన్నివేశాలు షూట్ చేసుకోవడానికి మేకర్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడని తెలుస్తోంది. అందులో భాగంగానే హను రాఘవపూడి ‘ఫౌజీ’ మూవీ షూటింగ్ ని రీసెంట్ గా తమిళనాడులో స్టార్ట్ చేశాడు.

ఇమాన్వి ఇస్మాయిల్ మీద కీలక సన్నివేశాలని ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. ప్రభాస్ లేని సీక్వెన్స్ లు అన్ని కూడా ముందుగా కంప్లీట్ చేయాలని హను రాఘవపూడి డిసైడ్ అయ్యారని టాక్. మరో వైపు మారుతి కూడా గతంలో ప్రభాస్ లేకుండానే ‘ది రాజాసాబ్’ షూటింగ్ స్టార్ట్ చేసి కీలక సన్నివేశాలు ఫినిష్ చేశారు. ఇలా క్రియేటివ్ ఫ్రీడమ్ ఇవ్వడం ద్వారా మేకర్స్ కి కూడా టైం దొరుకుతుంది. ప్రభాస్ డేట్స్ సెట్ అయిన తర్వాత ఆయనకి సంబందించిన సన్నివేశాలు పూర్తి చేయొచ్చు.

తద్వారా షూటింగ్ వేగంగా పూర్తయిపోతుంది. ప్రభాస్ స్టార్ డైరెక్టర్స్ తో పాటు, యంగ్ డైరెక్టర్స్ ని కూడా ఒకే రీతిలో రెస్పెక్ట్ చేస్తూ వారికి ఏం కావాలో అది చేయడం పైన దృష్టి పెట్టారంట. స్టోరీ లో చేతులు పెట్టకుండా దర్శకులకి క్రియేటివ్ ఫ్రీడమ్ ఇవ్వడం వలన వారి నుంచి మరింత బెస్ట్ అవుట్ ఫుట్ వస్తుందని ప్రభాస్ నమ్ముతున్నట్లు టాక్ వినిపిస్తోంది.