Begin typing your search above and press return to search.

వ‌ర‌ద ముంపు: సీఎం నిధికి ప్ర‌భాస్ - బ‌న్ని విరాళాలు

తెలుగు రాష్ట్రాల్లో వ‌ర‌ద బాధితుల‌కు టాలీవుడ్ నుంచి విరాళ‌ల వ‌ర‌ద కొన‌సాగుతోన్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   4 Sep 2024 7:37 AM GMT
వ‌ర‌ద ముంపు:  సీఎం నిధికి ప్ర‌భాస్ - బ‌న్ని విరాళాలు
X

తెలుగు రాష్ట్రాల్లో వ‌ర‌ద బాధితుల‌కు టాలీవుడ్ నుంచి విరాళ‌ల వ‌ర‌ద కొన‌సాగుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే చిత్ర ప‌రిశ్ర‌మ నుంచి దాత‌లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. హీరోలు, ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు ఎత్తున విరాళాలు ప్ర‌క‌టిస్తున్నారు. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ తెలుగు రాష్ట్రాల‌కు రెండు కోట్లు విరాళం ప్ర‌క‌టించారు. ఏపీకి కోటి..తెలంగాణాకి కోటి రూపాయ‌లు చొప్పున కేటాయించారు.

అలాగే వరదలకు గురైన ప్రాతాల్లో ప్రజలకి భోజనాలు, మంచి నీళ్లు ప్ర‌భాస్ ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేశారు. దీంతో ప్రభాస్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మా బాహుబ‌లి దాతృహృద‌యం అంటూ పోస్టులు పెడుతున్నారు. మీరు మా పాలిట దేవుడు అంటూ కీర్తిస్తున్నారు. ఇటీవల కేరళ విప‌త్తుకి కూడా డార్లింగ్ రెండు కోట్ల విరాళం ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విరాళం ప్రకటించారు. ఈ మేరకు అల్లు అర్జున్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. `సోషల్ మీడియాలో.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాల వల్ల ఏర్పడిన నష్టాలు చూసి నేను ఎంతో బాధపడ్డాను. ఇలాంటి విపత్తర సమయంలో నేను రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కి కలిపి ఒక కోటి రూపాయలు డొనేట్ చేస్తున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను` అని పోస్ట్ పెట్టారు. దీంతో బన్నీని అభిమానులు, నెటిజన్లు అభినందిస్తున్నారు. క‌ష్ట‌కాలంలో తోడున్న మా హీరోకి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు అంటూ పోస్టులు పెడుతున్నారు.

ఇప్పటికే చిరంజీవి, బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఎన్టీఆర్, మ‌హేష్‌, విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డ, నటి అనన్య నాగళ్ళ రెండు తెలుగు రాష్ట్రాలకు భారీగా విరాళాలు అందించిన సంగ‌తి తెలిసిందే. బాధితుల్ని ఆదుకోవాల‌ని వారి అభిమానుల‌కు కూడా పిలుపునిచ్చారు.