LCU లో ప్రభాస్..?
ఐతే లేటెస్ట్ గా తమిళ సూపర్ హిట్ డైరెక్టర్ తో ప్రభాస్ సినిమా ఉంటుందని ఒక టాక్ నడుస్తుంది.
By: Tupaki Desk | 9 Jan 2025 4:08 AM GMTరెబల్ స్టార్ ప్రభాస్ సినిమా అంటే పాన్ ఇండియా లెవెల్ లో హంగామా ఉంటుంది. బాహుబలి తర్వాత నుంచి ప్రభాస్ సినిమాలన్నీ కూడా నేషనల్ లెవెల్ ఆడియన్స్ ని మెప్పిస్తున్నాయి. ఇప్పటికే ప్రభాస్ సినిమాల లిస్ట్ చాలా ఉంది. అతనితో కొత్త సినిమా చేయాలంటే దర్శకులు ఎవరైనా నాలుగైదేళ్లు వెయిట్ చేయాల్సిందే. ప్రభాస్ ప్రస్తుతం రాజా సాబ్ పూర్తి చేయాలి, ఫౌజి, స్పిరిట్ లు సెట్స్ మీదకు వెళ్తున్నాయి. మరో పక్క సలార్ 2, కల్కి 2 ఉన్నాయి ఈ సినిమాలు పూర్తి చేశాక కానీ కొత్త సినిమా చేసే ఛాన్స్ లేదు. ఐతే లేటెస్ట్ గా తమిళ సూపర్ హిట్ డైరెక్టర్ తో ప్రభాస్ సినిమా ఉంటుందని ఒక టాక్ నడుస్తుంది.
హోంబలే ప్రొడక్షన్స్ ప్రభాస్ తో 3 సినిమాల అగ్రిమెంట్ చేసుకున్నారు. అందులో ఒకటి సలార్ 2 కాగా మిగతా రెండు ప్రాజెక్ట్ లు ఏవన్నది ఇంకా తెలియలేదు. ఐతే అందులోనే ఒకటి కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తో చేస్తారని తెలుస్తుంది. తమిళ్ లో లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్సిటీ LCUకి ఉన్న రేంజ్ తెలిసిందే. ఖైదీ, విక్రం, లియో త్వరలో రాబోతున్న కూలీ ఇలా తన సినిమాతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు లోకేష్.
మరి LCU లో ప్రభాస్ సినిమా చేసే ఛాన్స్ ఉందా అంటే కచ్చితంగా జరిగే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఐతే ఒకవేళ ప్రభాస్ తో లోకేష్ సినిమా తెస్తే ఇండియాకు బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అయిన ప్రభాస్ ని ఆయన రేంజ్ కి తగ్గట్టు చూపించగలడా.. ఆ రేంజ్ క్యారెక్టరైజేషన్ రాయగలడా అన్న చర్చ మొదలైంది. అసలు LCU లో ప్రభాస్ అన్న ఆలోచనే ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ కి సూపర్ కిక్ ఇస్తుంది. అదే జరిగితే మాత్రం ఇక ఫ్యాన్స్ కి పండగ అన్నట్టే లెక్క.
ప్రభాస్ సినిమాల సెలక్షన్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. క్రేజె కాంబినేషన్స్ సెట్ చేస్తూ కావాల్సినంత బజ్ క్రియేట్ చేస్తున్నారు. తప్పకుండా ప్రభాస్ లోకేష్ సినిమా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్న రేంజ్ లో ఉంటుందని చెప్పొచ్చు. ప్రభాస్ ఈ సినిమాలన్నీ పూర్తి చేస్తే మాత్రం పాన్ ఇండియా లెవెల్ లో తన తర్వాతే ఎవరైనా అన్న రేంజ్ లో సత్తా చాటుతాడని చెప్పొచ్చు. ఏది ఏమైనా రెబల్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం ప్రభాస్ చేస్తున్న కాంబినేషన్స్ కి సూపర్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.