Begin typing your search above and press return to search.

ఫాజీ 2026 ఛాన్స్ ఉందా..?

ఫౌజీ టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ సినిమాలో ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా కథ యుద్ధ నేపథ్యంలో పీరియాడికల్ మూవీగా వస్తుందని తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   23 Feb 2025 1:55 PM GMT
ఫాజీ 2026 ఛాన్స్ ఉందా..?
X

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో పాటు హను రాఘవపూడి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఫౌజీ టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ సినిమాలో ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా కథ యుద్ధ నేపథ్యంలో పీరియాడికల్ మూవీగా వస్తుందని తెలుస్తుంది.

ఐతే ప్రభాస్ ప్రస్తుతం ఈ రెండు సినిమాలకే టైం కేటాయించాడు. సందీప్ వంగతో స్పిరిట్ చేయాల్సి ఉన్నా రాజా సాబ్ పూర్తి చేశాక ఆ మూవీని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు. ప్రభాస్ ఫౌజీ, స్పిరిట్ రెండు ఒకేసారి షూటింగ్ జరుపుకోనున్నాయి. ఐతే మారుతితో చేస్తున్న రాజా సాబ్ లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుంచి రిలీజ్ వాయిదా పడుతుంది. కచ్చితంగా ఈ ఇయర్ రిలీజ్ ఉంటుంది కానీ అది ఎప్పుడన్నది మాత్రం క్లారిటీ రాలేదు.

మరోపక్క ఫౌజీ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నా ఈ సినిమా 2026 రిలీజ్ చేసే ఛాన్స్ ఉందా అంటే కష్టమే అన్నట్టు తెలుస్తుంది. సో రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి లాస్ట్ ఇయర్ లానే మళ్లీ 2026 కూడా కాబోతుంది. ప్రభాస్ వరుస సినిమాల కమిట్ మెంట్ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్నా ఆ సినిమాలను అనుకున్న టైం కి పూర్తి చేయకపోవడం వల్ల ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉంటున్నారు.

ప్రభాస్ రాజా సాబ్, ఫౌజీ, స్పిరిట్ తో పాటు సలార్ 2, కల్కి 2 చేయాల్సి ఉంది. ఈమధ్య రాజా సాబ్ కూడా రెండు భాగాలుగా వస్తుందని టాక్ నడుస్తుంది. రెబల్ స్టార్ స్పీడ్ పెంచి కమిటైన ఈ సినిమాలన్నీ పూర్తి చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుతున్నారు. ఐతే లేట్ గా వచ్చినా సరే రికార్డులు క్రియేట్ చేసేలా ప్రభాస్ సినిమాలు ఉంటాయని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. కాబట్టి ఈ వెయిటింగ్ కాస్త ఇబ్బంది పెడుతున్నా పర్వాలేదని ఫిక్స్ అయ్యారు రెబల్ ఫ్యాన్స్. అందుకే ఫ్యాన్స్ ఈ ఇయర్ రాజా సాబ్ రిలీజ్ ఉండగా మళ్లీ నెక్స్ట్ రిలీజ్ ఎప్పుడో అంటూ ఆ సినిమానే ఒక రేంజ్ లో సెలబ్రేట్ చేయాలని అనుకుంటున్నారు.