Begin typing your search above and press return to search.

'ఫౌజీ' రిలీజ్ కోసం బాక్సాఫీస్ ప్లాన్

ఇప్పుడు ప్రభాస్‌ కోసం మాస్ యాక్షన్ డ్రామా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుండటం మరో విశేషం.

By:  Tupaki Desk   |   6 Feb 2025 7:04 AM GMT
ఫౌజీ రిలీజ్ కోసం బాక్సాఫీస్ ప్లాన్
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మారుతి తెరకెక్కిస్తున్న ది రాజా సాబ్ షూటింగ్ పూర్తి దశకు చేరుకోగా, మరో భారీ ప్రాజెక్ట్ ఫౌజీ కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ది రాజా సాబ్ వేసవి కానుకగా థియేటర్లలో సందడి చేయబోతున్నప్పటికీ, ఫౌజీ మాత్రం రిలీక్ మాత్రం స్పెషల్ ప్లాన్ తో రాబోతోంది. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రభాస్‌ కెరీర్‌లో ఓ ప్రత్యేకమైన మలుపు కావచ్చనే అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమా ప్రత్యేకత ఏమిటంటే, ప్రభాస్ ఈ సినిమాలో ఓ ఫుల్ ఫ్లెడ్జ్ మిలిటరీ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. దేశభక్తి, యాక్షన్, ఎమోషన్ మేళవించిన కథాంశంతో ఈ సినిమా రాబోతోంది. సీతారామం లాంటి క్లాసిక్ ప్రేమకథను అందించిన హను రాఘవపూడి, ఇప్పుడు ప్రభాస్‌ కోసం మాస్ యాక్షన్ డ్రామా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుండటం మరో విశేషం.

ఇక లేటెస్ట్ అప్‌డేట్ ఏమిటంటే, ఈ సినిమా షూటింగ్‌ను మేకర్స్ 2025 చివరి నాటికి పూర్తిచేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం యాక్షన్ సీక్వెన్స్‌లు, కీలక షెడ్యూల్‌లను ప్లాన్ చేస్తుండగా, 2026 వేసవి సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ప్రభాస్ సినిమాలకు భారీ వసూళ్ల మార్కెట్ ఉన్న నేపథ్యంలో, సమ్మర్‌ రేస్‌లో రిలీజ్ చేస్తే బాక్సాఫీస్ వద్ద మంచి లాభాలు అందుకోవచ్చని మేకర్స్ అంచనా వేస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించి ప్రొడక్షన్‌ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ చేయకుండా మేకర్స్ ప్రతీ షాట్‌ను అత్యున్నత స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఫౌజీ సినిమాలో నటిస్తున్న ప్రధాన తారాగణం విషయానికి వస్తే, ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తుండగా, సంగీతాన్ని విశాల్ చంద్రశేఖర్ అందిస్తున్నాడు. ఇందులో యాక్షన్ సీక్వెన్స్‌లు, రొమాన్స్, ఎమోషన్ అన్నీ సమానంగా ఉండబోతున్నాయని సమాచారం.

ప్రభాస్ అభిమానులు ఇప్పటికే ఈ సినిమా అప్‌డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ గత సినిమాలు మిక్స్డ్ రెస్పాన్స్ అందుకున్నప్పటికీ, ఈ చిత్రం మాత్రం ఆయనను కొత్త యాంగిల్‌లో చూపించబోతోందని టాక్. ఇకపోతే ఈ చిత్రం విడుదలపై మేకర్స్ స్ట్రాటజీ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.