Begin typing your search above and press return to search.

హైద‌రాబాద్ లో మొద‌లై మ‌ధురైలో తేలిన‌ పౌజీ!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా హను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో పౌజీ ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   27 Sep 2024 12:30 AM GMT
హైద‌రాబాద్ లో మొద‌లై మ‌ధురైలో తేలిన‌ పౌజీ!
X

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా హను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో పౌజీ ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ కూడా ప్రారంభించుకుంది. కానీ ఎక్క‌డ షూటింగ్ జ‌రుగుతుంది అన్న దానిపై క్లారిటీ లేదు. హైద‌రాబాద్ లో మొద‌లైన షూట్ మ‌ధురైలో తేలింది. ప్ర‌స్తుతం మ‌ధురైలా షూటింగ్ చేస్తున్నారు. అయితే ఇందులో ప్ర‌భాస్ పాల్గొన‌లేదు. ప్ర‌భాస్ లేని స‌న్నివేశాల్ని తెర‌కెక్కిస్తున్నారు.

ఇత‌ర కీల‌క నటీనటుల‌పై హ‌ను స‌న్నివేశాలు తెర‌కెక్కిస్తున్నారు. ఈనేపథ్యంలో ప్ర‌భాస్ షూట్ లో ఎప్పుడు జాయిన్ అవుతారు? అన్న దానిపై జాప్యం చోటు చేసుకుంది. ఇందులో ప్ర‌భాస్ రెండు కోణాల్లో సాగే పాత్ర‌లు పోషిస్తున్నాడు. ఓ హీరోయిన్ గా ఇమ్మాన్వీని ఎంపిక చేసిన సంగ‌తి తెలిసిందే. అమ్మ‌డు సెట్స్ కి వెళ్ల‌కముందేయూత్ని ఉపేస్తోంది. సోష‌ల్ మీడియాలో త‌న డాన్స్ ట్యాలెంట్ వీడియోలు పోస్ట్ చేసి ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తోంది.

అమ్మ‌డి మూవ్ మెంట్స్ చూస్తుంటే డార్లింగ్ ఆమెతో డాన్సులో పోటీ ప‌డ‌టం క‌ష్ట‌మే అన‌క త‌ప్ప‌దు. ప్ర‌భాస్ భారీ క‌టౌట్ ని బేస్ చేసుకుని స్టెప్స్ కంపోజ్ చేస్తుంటారు కోరియోగ్రాఫ‌ర్లు. కాబ‌ట్టి ప్ర‌భాస్ ని మ్యాచ్ చేస్తూ ఇమ్మాన్వీ డాన్స్ చేయాల్సి ఉంటుంది. అలాగే మ‌రో హీరోయిన్ ఎవ‌రు? అన్న‌ది తెలియాలి.ఇప్ప‌టికే ఆమె కోసం అన్వేష‌ణ సాగుతుంది. ఈ పాత్ర కోసం పేరున్న భామ‌ని దించాల‌ని హ‌ను ప్లాన్ చేస్తున్నాడుట‌.

సినిమాలో ప్ర‌భాస్ పోషించే ఈ రోల్ ఎంతో కీల‌కంగా ఉంటుందని...ఆయ‌న పాన్ ఇండియా ఇమేజ్ ని మ్యాచ్ చేసే నాయిక అవ‌స‌రంగా భావిస్తున్నారుట‌. కాబ‌ట్టి హ‌ను రాఘ‌వ‌పూడి బాలీవుడ్ ఛాన్స్ తీసుకునే అవ‌కాశం ఉంది. ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్ తో మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే.