ప్రేమ ఖైదీగా జైల్లో పౌజీ!
సినిమా ప్రారంభమైన నాటి నుంచి గ్యాప్ లేకుండా హను అండ్ కో సెట్స్ లో ఉంది. వివిధ లొకేషన్లలో సన్నివేశాలు చిత్రీకరించారు.
By: Tupaki Desk | 28 Jan 2025 8:30 AM GMTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా హను రాఘవపూడి దర్శకత్వంలో `పౌజీ` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ కూడా పూర్తయింది. సినిమా ప్రారంభమైన నాటి నుంచి గ్యాప్ లేకుండా హను అండ్ కో సెట్స్ లో ఉంది. వివిధ లొకేషన్లలో సన్నివేశాలు చిత్రీకరించారు. అయితే ఇప్పటి వరకూ మేజర్ షెడ్యూల్స్ మొదలవ్వలేదు. తాజాగా ఆ షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీలో మొదలైనట్లు తెలుస్తోంది.
ఇందులో కీలకమైన యాక్షన్ సన్నివేశాలతో పాటు, ఎమోషనల్ గా ఉండే మరికొన్ని సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఇందులో ప్రభాస్ తో పాటు ప్రధాన తారాగణమంతా పాల్గొంటుంది. ప్రముఖంగా జైలు నేపథ్యంలో సాగే పోరాట సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలిసింది. ప్రత్యేకంగా నిర్మించిన సెట్ లోనే ఈ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. లవ్ అండ్ వార్ స్టోరీకి ఈ చిత్రాన్ని హను తెరకెక్కిస్తున్నాడు.
దీనిలో భాగంగా ప్రభాస్ ను ప్రేమ ఖైదీగానూ సినిమాలో హైలైట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రియురాలి ప్రేమ కోసం తాను ఖైదీగా మారిన సన్నివేశాలను ఇదే షెడ్యూల్ లో చిత్రీకరిస్తున్నట్టు చిత్ర వర్గాలు తెలిపాయి. ప్రభాస్-ఇమాన్వీ మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలతో ఫిదా అవ్వడం ఖాయమంటున్నారు. ఇది లాంగ్ షెడ్యూల్ అని తెలుస్తోంది. ప్రధాన తారగాణమంతా షూట్ లో పాల్గొంటారు. స్టోరీ, స్క్రీన్ ప్లే పరంగా ఈ సినిమా హాలీవుడ్ చిత్రంలో ఉండబోతుందని ఇప్పటికే ప్రచారంలో ఉంది.
కథలో ట్విస్ట్ లు నెవ్వెర్ బిఫోర్ గా ఉంటాయని రైటర్ల బృందం చెబుతుంది. కథ పూర్తిగా 1940 బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. హను శైలి లవ్ స్టోరీతో పాటు, బలమైన డ్రామా, భారీ యాక్షన్ సన్నివేశా లున్నాయి. ఇదంతా కూడా దేశ భక్తి నేపథ్యంతో మిళితమై ఉంటుంది. అదీ స్వాతంత్య్రానికి పూర్వం జరిగే కథ. ఇది. అప్పటి వాతావరణా న్నిస్పృ షిస్తూ అద్భుతమైన సెట్లు నిర్మిస్తున్నారు.