Begin typing your search above and press return to search.

ప్రభాస్‌ - హను మూవీ బర్త్‌డే అప్‌డేట్‌

ఫౌజీ వర్కింగ్ టైటిల్‌ తో షూటింగ్‌ జరుపుతున్న మేకర్స్‌ నుంచి ప్రభాస్ బర్త్‌ డే అప్డేట్‌ వస్తుందని ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

By:  Tupaki Desk   |   23 Oct 2024 8:02 AM GMT
ప్రభాస్‌ - హను మూవీ బర్త్‌డే అప్‌డేట్‌
X

ప్రభాస్ హీరోగా ప్రస్తుతం పలు సినిమాలు రూపొందుతున్నాయి. అందులో మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రాజా సాబ్‌ సినిమా ఒకటి కాగా మరో వైపు సలార్‌, కల్కి సినిమాలకు సీక్వెల్స్ రూపొందాల్సి ఉంది. ఇక అర్జున్‌ రెడ్డి, యానిమల్‌ సినిమాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్‌ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమాల అన్నింటి తర్వాత ప్రకటన వచ్చిన హను రాఘవపూడి సినిమాకు సంబంధించిన షూటింగ్‌ చాలా స్పీడ్‌ గా సాగుతోందని సమాచారం అందుతోంది. ఫౌజీ వర్కింగ్ టైటిల్‌ తో షూటింగ్‌ జరుపుతున్న మేకర్స్‌ నుంచి ప్రభాస్ బర్త్‌ డే అప్డేట్‌ వస్తుందని ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రాజాసాబ్‌ సినిమా షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది. వచ్చే సమ్మర్‌లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. ప్రస్తుతం అందరి దృష్టి సీతారామం చిత్ర దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఫౌజీ సినిమా పై ఉంది. యుద్దం నేపథ్యంలో ప్రేమ కథను దర్శకుడు హను రాఘవపూడి చూపించబోతున్నాడు. ఆయన నుంచి వచ్చే ప్రతి సినిమా దేనికి అదే అన్నట్లుగా విభిన్నంగా ఉంటాయి. కనుక ఈ సినిమా సైతం తప్పకుండా అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఉంటుంది అనే నమ్మకంను అన్ని వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.

ప్రభాస్‌ ఫౌజీ లో ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వలేదు. అలాగే సినిమా యొక్క షూటింగ్‌ గురించి అధికారికంగా క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పటికే సినిమా షూటింగ్‌ రెండు షెడ్యూల్స్ జరిగాయి. మొన్నటి వరకు చెన్నైలో కీలక షెడ్యూల్‌ ప్రభాస్‌ లేకుండానే చేయడం జరిగింది. ఎట్టకేలకు ఫౌజీ సినిమా షూటింగ్‌ లో ప్రభాస్ జాయిన్ అవ్వబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. అక్టోబర్ 25 నుంచి ప్రభాస్‌ ఫౌజీ కోసం కెమెరా ముందుకు రాబోతున్నారని సమాచారం అందుతోంది.

హైదరాబాద్‌ శివారులో వేసిన భారీ సెట్టింగ్‌ లో సినిమా యొక్క చిత్రీకరణ జరుపుతున్నారు. బర్త్‌డే వేడుకల్లో పాల్గొన్న ప్రభాస్ ఒక్క రోజు గ్యాప్‌ తీసుకుని 25వ తారీకు నుంచి షూటింగ్‌లో పాల్గొనబోతున్నాడు. ఇప్పటికే మేకర్స్‌ ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రభాస్ లేకుండానే దాదాపుగా 20 రోజుల షూటింగ్‌ చేసిన హను రాఘవపూడి చాలా స్పీడ్‌గా సినిమాను ముగించి వచ్చే ఏడాదిలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని భావిస్తున్నాడు. ఈ ఏడాదిలో కల్కి సినిమాతో హిట్‌ కొట్టిన ప్రభాస్ వచ్చే ఏడాది రెండు సినిమాలతో సూపర్‌ హిట్‌ కొట్టేనా చూడాలి. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో సలార్‌ 2 సినిమా సైతం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తుందనే నమ్మకంతో ఫ్యాన్స్ ఉన్నారు. మరి అది ఎంతవరకు సాధ్యం అనేది చూడాలి.