జనవరి నుంచే అసలు లెక్క.. రెబల్ స్టార్ ఫిక్స్ చేశాడంతే..!
జనవరి తర్వాత నుంచి ప్రభాస్ హను మూవీ షూట్ లో పాల్గొంటాడని తెలుస్తుంది. ప్రభాస్ హను ఈ కాంబో సినిమాకు ఫౌజి అనే టైటిల్ పరిశీలనలో ఉంది.
By: Tupaki Desk | 19 Dec 2024 2:45 AM GMTబాహుబలి కోసం ఐదేళ్లు అది కూడా రెండు సినిమాలకు అన్నేళ్లా అన్న ఆడియన్స్ కి, ఫ్యాన్స్ కి ఆ సినిమా ఫలితాలతో సమాధానం చెప్పాడు రెబల్ స్టార్ ప్రభాస్. ఆ సినిమా తర్వాత ప్రభాస్ చేస్తున్న ప్రతి సినిమా పాన్ ఇండియా వైడ్ భారీ రిలీజ్ అవుతున్నాయి. అందుకు తగినట్టుగానే రిజల్ట్ లు అందుకుంటున్నాయి. లాస్ట్ ఇయర్ ఆదిపురుష్, సలార్ 1 తో ప్రేక్షకులను అలరించిన ప్రభాస్ ఈ ఇయర్ కల్కితో మరో 1000 కోట్ల సినిమా అందించాడు.
కల్కి తర్వాత కొద్దిగా రిలాక్స్ అయిన ప్రభాస్ నెక్స్ట్ నాలుగైదు సినిమాలు లైన్ లో పెట్టాడు. ప్రస్తుతం మారుతి డైరెక్షన్ లో రాజా సాబ్ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఆ సినిమా 80 శాతం పైగా పూర్తైంది. ఐతే ఆ సినిమాతో పాటు హను రాఘవపుడి తో సినిమా కూడా సెట్స్ మీదకు వెళ్లింది. గత నెల నుంచి హను మూవీ షూటింగ్ జరుగుతుంది. ఐతే ప్రభాస్ మాత్రం ఆ సినిమా షూటింగ్ లో ఇంకా పాల్గొనలేదని తెలుస్తుంది.
జనవరి తర్వాత నుంచి ప్రభాస్ హను మూవీ షూట్ లో పాల్గొంటాడని తెలుస్తుంది. ప్రభాస్ హను ఈ కాంబో సినిమాకు ఫౌజి అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమాలో ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా జనవరి తర్వాత ఇంపార్టెంట్ సీన్స్ ప్లాన్ చేస్తారని తెలుస్తుంది. ఇప్పటివరకు ప్రభాస్ లేని సీన్స్ ఇంకా మిగతా సీన్స్ ని షూట్ చేస్తున్నారు హను రాఘవపుడి.
ఇక ఈ సినిమాతో పాటు ప్రభాస్ సందీప్ వంగ కాంబోలో వస్తున్న స్పిరిట్ సినిమా కూడా సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉంది. 2025 లో ప్రభాస్ రాజా సాన్, ఫౌజి, స్పిరిట్ 3 సినిమాలకు డేట్స్ ఇవ్వబోతున్నాడు. ఫౌజి సినిమా 2026 రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సీతారామం తో సూపర్ హిట్ అందుకున్న హను రాఘవపుడి ప్రభాస్ తో చేస్తున్న సినిమాతో కూడా మరో బ్లాక్ బస్టర్ టార్గెట్ పెట్టుకున్నారు. ఇవే కాకుండా కల్కి 2 సినిమాకు కూడా నెక్స్ట్ ఇయర్ డేట్స్ అడ్జెస్ట్ చేయాల్సి ఉంది. ఇక మీద ఏడాదికి రెండు సినిమాలు రిలీజ్ చేయాలని ప్రభాస్ ప్లాన్ చేస్తున్నాడు. మరి అందుకు తగినట్టుగా షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటున్నాడని తెలుస్తుంది.