Begin typing your search above and press return to search.

ప్రభాస్ హను.. ఎప్పుడు? ఎక్కడ?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ది రాజాసాబ్ సినిమా షూట్ లో ఉన్నారు.

By:  Tupaki Desk   |   10 Sep 2024 11:30 AM GMT
ప్రభాస్ హను.. ఎప్పుడు? ఎక్కడ?
X

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ది రాజాసాబ్ సినిమా షూట్ లో ఉన్నారు. గ్యాప్ తీసుకోకుండా మారుతి ఈ మూవీ షూటింగ్ కొనసాగిస్తున్నారని తెలుస్తోంది. ప్రభాస్ తో పాటు మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ఈ షూటింగ్ లో పాల్గొన్నారు. ఈ చిత్రంలో హీరో, హీరోయిన్స్ మధ్య వచ్చే కామెడీ సీక్వెన్స్ ని మారుతి తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఇదిలా ఉంటే ప్రభాస్ రీసెంట్ గా హను రాఘవపూడి దర్శకత్వంలో మూవీ స్టార్ట్ చేశారు.

ఈ సినిమాలో ఇమాన్వి ఇస్మాయిల్ అనే అమ్మాయి ప్రభాస్ కి జోడీగా నటిస్తోంది. సెకండ్ వరల్డ్ వార్ కి ముందు జరిగిన కథతో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఫౌజీ అనే టైటిల్ ని ఈ చిత్రానికి ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియదు. ప్రభాస్ బ్రిటిష్ ఇండియా ఆర్మీ సోల్జర్ గా ఈ చిత్రంలో కనిపిస్తాడని టాక్. మూవీ లాంచింగ్ సందర్భంగా రిలీజ్ చేసిన ప్రీలుక్ పోస్టర్ లో వార్ ఎలివేషన్ ఉంది.

దీనిని బట్టి ఈ సినిమా యాక్షన్ బ్యాక్ డ్రాప్ లోనే ఉండబోతోందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే వచ్చే వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతోందని సమాచారం. తమిళనాడులోని కారైకుడిలో ఈ సినిమా ఫస్ట్ షెడ్యుల్ స్టార్ట్ చేయబోతున్నారు. కీలకమైన సన్నివేశాలు కారైకుడి ప్యాలస్ లలో చిత్రీకరించబోతున్నారని తెలుస్తోంది. ప్రభాస్ ఈ ఫస్ట్ షెడ్యుల్ షూటింగ్ లో పాల్గొంటారంట. త్వరలో నిర్మాతలు షూటింగ్ షెడ్యుల్ పై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

ఈ మూవీ కోసం హైదరాబాద్ లో ప్రత్యేకమైన సెట్స్ కూడా వేస్తున్నారు. ఈ సెట్స్ లో సెకండ్ షెడ్యుల్ ని స్టార్ట్ చేసే అవకాశం ఉండొచ్చనే మాట వినిపిస్తోంది. విశాల్ భరద్వాజ్ ఫౌజీ సినిమాకి మ్యూజిక్ అందించబోతున్నారు. సీతారామం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత హను రాఘవపూడి నుంచి వస్తోన్న సినిమా కావడంతో ఫౌజీపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

ఇందులో వార్ సీక్వెన్స్ తో పాటు తన స్టైల్ లో బలమైన ఎమోషనల్ లవ్ డ్రామాని కూడా హను రాఘవపూడి చూపించాబోతున్నాడని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఈ మూవీలో సుభాస్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీ గురించి కూడా హను రాఘవపూడి ఇంటరెస్టింగ్ అంశాలు చెప్పబోతున్నారనే మాట వినిపిస్తోంది.