Begin typing your search above and press return to search.

ఈ ఇద్దరిలో.. ప్రభాస్ తో జోడీ కట్టేదెవరో?

హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్స్ లో చిత్రీకరణ సాగుతోంది.

By:  Tupaki Desk   |   18 Feb 2025 4:30 PM GMT
ఈ ఇద్దరిలో.. ప్రభాస్ తో జోడీ కట్టేదెవరో?
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ హను రాఘవపూడి కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఆ మూవీ షూటింగ్.. కొద్ది రోజుల క్రితం మొదలవ్వగా ఇప్పుడు శరవేగంగా జరుగుతోంది. హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్స్ లో చిత్రీకరణ సాగుతోంది.


టాలీవుడ్ ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఆ సినిమాలో కొత్త బ్యూటీ ఇమాన్ ఇస్మాయిల్ హీరోయిన్ గా నటిస్తోంది. మూవీలో ప్రభాస్ సైనికుడిగా కనిపించనున్నట్లు ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. స్వాతంత్య్రానికి పూర్వం జరిగే కథతో మూవీ రూపొందుతుండగా.. ఇప్పటికే ఆడియన్స్ లో మంచి బజ్ నెలకొంది.

అదే సమయంలో నేచురల్ బ్యూటీ సాయిపల్లవిని మేకర్స్ కీలక పాత్ర కోసం ఇటీవల సంప్రదించనున్నారని ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. ఇప్పటికే పడి పడి లేచే మనసు మూవీకి గాను హను రాఘవపూడితో సాయి పల్లవి వర్క్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు మరోసారి కలిసి పని చేయనున్నారని జోరుగా ప్రచారం సాగింది.

బ్రిటీష్‌ వారి సైనికుడిగా సినిమాలో ప్రభాస్‌ కనిపించనుండగా.. యువ‌రాణి పాత్ర‌లో బాలీవుడ్ న‌టి ఆలియా భ‌ట్ న‌టించ‌బోతున్న‌ట్లు ఇప్పుడు వార్త‌లు వ‌స్తున్నాయి. యువ‌రాణి రోల్ మూవీలో కీల‌కం కావ‌డంతో ఆలియా భ‌ట్‌ ను తీసుకోబోతున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది. కానీ మేకర్స్ ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు.

దీంతో ఇప్పుడు ఆలియా భట్, సాయి పల్లవి పేర్లను ఒకే రోల్ కోసం పరిగణనలోకి తీసుకుంటున్నట్లు ఇప్పుడు తెలుస్తోంది. ప్రభాస్ తో ఎవరు స్క్రీన్ షేర్ చేసుకోనున్నారని మాట్లాడుకుంటున్నారు. ఎవరితో డార్లింగ్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగుంటుందోనని డిస్కస్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ విషయం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

ఇక కెరీర్ విషయానికొస్తే.. సినిమాలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ బాణీలు సమకూరుస్తున్నారు. అయితే 2026 వేసవిలో మూవీ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. రాజా సాబ్, ఫౌజీ రిలీజ్ ల మధ్య ఆరు నెలల గ్యాప్ ఉండేలా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. మరి ప్రభాస్, హను రాఘవపూడి మూవీ ఎప్పుడు విడుదలవుతుందో వేచి చూడాలి.