Begin typing your search above and press return to search.

ప్రభాస్.. ఒకేసారి మూడు

అంత పెద్ద స్టార్ అయిన కూడా ప్రభాస్ ఎక్కడా గ్యాప్ తీసుకోకుండా సినిమాలు లైన్ లో పెట్టారు.

By:  Tupaki Desk   |   31 Aug 2024 3:56 AM GMT
ప్రభాస్.. ఒకేసారి మూడు
X

ఇండియన్ నెంబర్ వన్ యాక్టర్ గా దూసుకుపోతున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు లైన్ లో పెట్టారు. ఈ ఏడాది కల్కి 2898ఏడీతో సాలిడ్ సక్సెస్ అందుకున్న ప్రభాస్ బాక్సాఫీస్ దగ్గర తనకి తిరుగులేదని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. బాహుబలి 2 తర్వాత వెయ్యి కోట్ల క్లబ్ లో చేరిన ప్రభాస్ సెకండ్ మూవీగా కల్కి మారింది. ఇదిలా ఉంటే డార్లింగ్ నుంచి నెక్స్ట్ రాబోయే సినిమాలలో కనీసం మూడు చిత్రాలు 1000 కోట్లకి పైగా కలెక్షన్స్ ని సాధించే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

అంత పెద్ద స్టార్ అయిన కూడా ప్రభాస్ ఎక్కడా గ్యాప్ తీసుకోకుండా సినిమాలు లైన్ లో పెట్టారు. ప్రతి ఏడాది కనీసం ఒకటి, రెండు సినిమాలకి ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మిగిలిన హీరోలు అందరూ రెండేళ్లకి ఒక సినిమా కూడా చేయడం గగనం అయిపోతుంది. కానీ ప్రభాస్ మాత్రం పెర్ఫెక్ట్ ప్లానింగ్ తో సినిమాలు చేసుకుంటూ మూవీస్ రిలీజ్ చేస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవిలో ప్రభాస్ నుంచి ది రాజాసాబ్ మూవీ థియేటర్స్ లోకి రానుంది.

ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఇదిలా ఉంటే రీసెంట్ గా హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమాని ప్రభాస్ స్టార్ట్ చేశారు. ఇది సెకండ్ వరల్డ్ వార్ కి ముందు బ్రిటిష్ ఇండియాలో జరిగిన కథగా ఉండబోతోంది. అలాగే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ మూవీ ప్రీప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయ్యింది. నాగ్ అశ్విన్ తో కల్కి 2898 ఏడీ పార్ట్ 2 షూటింగ్ కూడా ప్రారంభించాల్సి ఉంది. వీటితో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ పార్ట్ 2 కూడా లైన్ లో ఉంది.

అయితే వీటిలో ది రాజాసాబ్ మూవీ షూటింగ్ ఆల్ మోస్ట్ నవంబర్ కి కంప్లీట్ చేసే అవకాశం ఉందంట. ఆ తరువాత హనుతో చేయబోయే ఫౌజీ, సందీప్ రెడ్డి స్పిరిట్, నాగ్ అశ్విన్ కల్కి 2 చిత్రాల షూటింగ్స్ ప్రభాస్ మొదలు పెడతాడంట. హను ఫౌజీ మూవీ ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతోందంట. అది కంప్లీట్ అయితే షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్రభాస్ రెడీగా ఉన్నారంట. దీంతో పాటుగా స్పిరిట్, కల్కి సినిమాలని ప్రభాస్ సమాంతరంగా చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

బ్యాక్ టూ బ్యాక్ షెడ్యూల్స్ తో ఈ మూవీస్ అన్ని కూడా ఫినిష్ చేయాలని డిసైడ్ అయ్యాడంట. అయితే రెస్ట్ లేకుండా ఇలా చేయడం ఎంత వరకు సాధ్యం అవుతుందనేది తెలియాల్సి ఉంది. గతంలో స్టార్ హీరోలు సినిమా షూటింగ్స్ షిఫ్ట్స్ వైజ్ గా చేసేవారు. ఎక్కువగా సూపర్ స్టార్ కృష్ణ షిఫ్ట్ ల వారీగా ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ జెనరేషన్ హీరోలు అంత రిస్క్ చేయడం లేదు. ఒకదాని తర్వాత ఒకటి సెట్ చేసుకుంటున్నారు. కానీ ప్రభాస్ మాత్రం రిస్క్ తీసుకుంటుంన్నారు. సమాంతరంగా మూవీ షూటింగ్స్ ప్లాన్ చేసుకుంటున్నారు.

ది రాజాసాబ్ మూవీ 2025 ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది. దీని తర్వాత హను దర్శకత్వంలో చేయబోయే ఫౌజీ మూవీ 2025 చివరలో లేదంటే 2026 మధ్యలో రిలీజ్ ఐయ్యే ఛాన్స్ ఉందంట. నెక్స్ట్ స్పిరిట్ మూవీ 2026 ఆఖర్లో లేదంటే 2027 ఆరంభంలో రిలీజ్ కావొచ్చని అంటున్నారు. కల్కి పార్ట్ 2 మూవీ 2027 లేదంటే 2028లో ఉండొచ్చంట. వీటిని పూర్తి చేసిన తర్వాత సలార్ పార్ట్ 2 చేసే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది.