Begin typing your search above and press return to search.

స్పిరిట్‌ : ప్రభాస్‌ ఫ్యాన్స్ కోసం మూడు...!

పాన్‌ ఇండియా సూపర్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న భారీ బడ్జెట్‌ సినిమాలు రాబోయే రెండు మూడేళ్లు బ్యాక్‌ టు బ్యాక్ విడుదల కాబోతున్నాయి.

By:  Tupaki Desk   |   16 Sep 2024 8:30 AM GMT
స్పిరిట్‌ : ప్రభాస్‌ ఫ్యాన్స్ కోసం మూడు...!
X

పాన్‌ ఇండియా సూపర్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న భారీ బడ్జెట్‌ సినిమాలు రాబోయే రెండు మూడేళ్లు బ్యాక్‌ టు బ్యాక్ విడుదల కాబోతున్నాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన సలార్‌, కల్కి 2898 ఏడీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ముందు ముందు రాబోతున్న సినిమాల లైనప్‌ కూడా భారీగా ఉంది. అందులో సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందనున్న స్పిరిట్‌ ఒకటి అనే విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ పాన్‌ ఇండియా ను మించి విదేశీ భాషల్లో కూడా విడుదల కాబోతున్న మూవీ 'స్పిరిట్‌'.

అర్జున్‌ రెడ్డి, యానిమల్ సినిమాలతో వైల్డ్‌ దర్శకుడిగా పేరు దక్కించుకున్న సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం 'స్పిరిట్‌' సినిమా స్క్రిప్ట్‌ వర్క్‌ లో బిజీగా ఉన్నాడు. ఇంతకు ముందే కథను రెడీ చేసిన ఈ దర్శకుడు గత కొన్ని రోజులుగా డైలాగ్‌ వర్షన్ ను రాస్తున్నాడట. ఈ ఏడాది చివరి వరకు రైటింగ్‌ పార్ట్‌ పూర్తి అవ్వబోతుంది. ఆ తర్వాత షూటింగ్‌ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. యానిమల్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో పాన్ ఇండియా సూపర్‌ స్టార్‌ తో ఆయన తీయబోతున్న సినిమా అంతకు మించి ఉంటుందని ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

స్పిరిట్‌ ఎప్పుడెప్పడు వస్తుందా అంటూ ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కోసం మూడు ఆసక్తికర విషయాలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మొదటగా స్పిరిట్‌ సినిమాలో ప్రభాస్ ను డ్యుయెల్‌ రోల్‌ లో చూడబోతున్నాం. ఈ మధ్య కాలంలో పెద్ద హీరోలు డ్యుయెల్‌ రోల్‌ చేసిన సినిమాలు భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. కనుక స్పిరిట్‌ కూడా కచ్చితంగా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇక మరో విషయానికి వస్తే... ప్రభాస్ ను పవర్‌ ఫుల్‌ మాఫియా డాన్‌ పాత్రలో దర్శకుడు సందీప్‌ వంగ 'స్పిరిట్‌' సినిమాలో చూపించబోతున్నాడట.

ఇక చివరగా ఈ సినిమా ను ప్రభాస్ గత చిత్రాలకు ఏమాత్రం తగ్గకుండా భారీ బడ్జెట్‌ తో నిర్మించబోతున్నారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం, ముందస్తు అంచనా ప్రకారం 'స్పిరిట్‌' కోసం నిర్మాతలు రూ.400 కోట్ల ను ఖర్చు పెట్టబోతున్నారు. సినిమా మేకింగ్‌ కు ఏడాదికి పైగా పట్టే అవకాశాలు ఉన్నాయి. కనుక అప్పటి వరకు బడ్జెట్‌ మరో వంద కోట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయనే టాక్ కూడా వినిపిస్తోంది. ప్రభాస్ సినిమా మినిమం ఉన్నా వెయ్యి కోట్ల రూపాయలు వసూళ్లు నమోదు చేస్తుంది. కనుక ఈ సినిమా రూ.500 కోట్ల బడ్జెట్‌ తో రూపొందినా ఈజీగా బ్రేక్ ఈవెన్‌ అవ్వడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరో వెయ్యి కోట్ల మూవీ లోడింగ్‌ అంటూ 'స్పిరిట్‌' గురించి మేకర్స్ చాలా నమ్మకంగా చెబుతున్నారు.