Begin typing your search above and press return to search.

ప్రభాస్ కు గాయం.. ఇక ఆ సినిమాకు దూరంగా..

అయితే డార్లింగ్ రీసెంట్ గా గాయపడ్డారు. ఓ సినిమా షూటింగ్ లో గాయపడినట్లు ఆయన తెలిపారు. కాలు బెణకడంతో డాక్టర్లు ఆయనకు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు!

By:  Tupaki Desk   |   16 Dec 2024 10:20 AM GMT
ప్రభాస్ కు గాయం.. ఇక ఆ సినిమాకు దూరంగా..
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. నాన్ స్టాప్ గా మూవీ షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. రీసెంట్ గా కల్కి 2898 ఏడీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుని సత్తా చాటారు.

ఇప్పుడు మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేస్తున్నారు. హారర్ కామెడీ జోనర్ లో తెరకెక్కుతున్న ఆ సినిమా.. వచ్చే ఏడాది వేసవిలో ఏప్రిల్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్.. రాజా సాబ్ లో విభిన్నమైన రోల్స్ పోషిస్తున్నట్లు ఇప్పటికే ప్రమోషన్స్ ద్వారా అందరికీ క్లారిటీ వచ్చేసింది.

అదే సమయంలో హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటున్నారు ప్రభాస్. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ఆ మూవీ రూపొందుతోంది. అయితే డార్లింగ్ రీసెంట్ గా గాయపడ్డారు. ఓ సినిమా షూటింగ్ లో గాయపడినట్లు ఆయన తెలిపారు. కాలు బెణకడంతో డాక్టర్లు ఆయనకు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు!

అయితే గాయపడిన విషయాన్ని ప్రభాస్ స్వయంగా తెలిపారు. "జపాన్ లో నా అభిమానులకు సారీ చెబుతున్నా. గాయం కారణంగా కల్కి ప్రమోషన్స్ కు అటెండ్ అవ్వలేకపోతున్నా. డిస్ట్రిబ్యూటర్ల టీమ్ ప్రమోషన్స్ లో పాల్గొంటుంది" అంటూ రాసుకొచ్చారు. త్వరలోనే జపాన్ అభిమానులను కలవాలనుకుంటున్నట్లు తెలిపారు.

ఇక 2025 జనవరి 3వ తేదీన జపాన్ లో కల్కి మూవీని రిలీజ్ చేసేందుకు మేకర్స్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. డిసెంబర్ 18వ తేదీన భారీ ఈవెంట్ ను కూడా ప్లాన్ చేశారట. దీంతో మూవీ టీమ్ అంతా వెళ్లి జపాన్ లో మూడు రోజుల పాటు ఓ రేంజ్ లో ప్రమోషన్స్ చేపట్టనున్నట్లు కొద్ది రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి.

ప్రభాస్ తో పాటు దీపికా పదుకొణె, దిశా పటానీ సహా పలువురు జపాన్ వెళ్తారని టాక్ వినిపించింది. బాహుబలి మూవీకి జరిగినట్లే భారీగా ప్రమోషన్స్ చేపట్టనున్నారని గుసగుసలు వినిపించాయి. ఇప్పుడు ప్రభాస్.. గాయం వల్ల ప్రమోషన్స్ ను స్కిప్ చేయాల్సి వచ్చింది. మరి ఎవరెవరు వెళ్తారో.. సినిమాను ఎలా ప్రమోట్ చేస్తారో వేచి చూడాలి.