వామ్మో రెబలోడి రచ్చ ఈ రేంజ్ లోనా..?
కల్కి తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమాల లిస్ట్ చూస్తే రెబల్ ఫ్యాన్స్ కి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.
By: Tupaki Desk | 30 Nov 2024 6:30 PM GMTరెబల్ స్టార్ ప్రభాస్ తన పాన్ ఇండియా సినిమాలతో రచ్చ షురూ చేశాడు. ఎప్పుడైతే బాహుబలి రిలీజైందో అప్పటి నుంచి ప్రభాస్ నేషనల్ స్టార్ అయ్యాడు. అతను చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా లెవెల్ లో భారీ బిజినెస్ చేస్తున్నాయి. లాస్ట్ ఇయర్ చివర్లో సలార్ 1, ఈ ఇయర్ కల్కి ఈ సినిమాలతో తన బాక్సాఫీస్ స్టామినాను మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు ప్రభాస్. కల్కి తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమాల లిస్ట్ చూస్తే రెబల్ ఫ్యాన్స్ కి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.
ప్రభాస్ ప్రస్తుతం మారుతి డైరెక్షన్ లో రాజా సాబ్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాను ఏప్రిల్ లో రిలీజ్ చేసేలా షూటింగ్ షెడ్యూల్ పెట్టుకున్నాడు. దీనితో పాటే ఇప్పటికే హను రాఘవపుడితో చేస్తున్న ఫౌజి సినిమా సెట్స్ మీద ఉంది. ఈ సినిమా షూటింగ్ లో ప్రభాస్ జనవరి లో జాయిన్ అవుతాడని తెలుస్తుంది. ఇదే కాకుండా సందీప్ రెడ్డి డైరెక్షన్ లో స్పిరిట్ కూడా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతుంది.
ఇవే కాకుండా నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ లో కల్కి 2, సలార్ 2 కూడా చేస్తాడని అంటున్నారు. ఇప్పటివరకు ప్రభాస్ కమిటైన సినిమాలు ఇవి కాగా మరో రెండు సినిమాలు కూడా అవి డిస్కషన్ స్టేజ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. అందులో ఒకటి ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో ప్రభాస్ సినిమా ఉంటుందని టాక్. హనుమాన్ తో పాన్ ఇండియా డైరెక్టర్ గా సూపర్ హిట్ అందుకున్న ప్రశాంత్ వర్మ ప్రభాస్ కోసం కథ సిద్ధం చేసినట్టు తెలుస్తుంది.
ఇక కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కూడా ప్రభాస్ తో సినిమాకు రెడీ అంటున్నాడట. ప్రభాస్ తో సినిమా చేయాలని ఇప్పటికే కథ రెడీ చేసినట్టు తెలుస్తుంది. కచ్చితంగా ఈ సినిమాలన్నీ వస్తే మాత్రం బాక్సాఫీస్ పై రెబలోడి విధ్వంసం చూసే ఛాన్స్ ఉంది.
రెబల్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమాలతో ప్రభాస్ పాన్ ఇండియా రికార్డులను బ్రేక్ చేస్తాడని ఫిక్స్ అయ్యారు. నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ కి రాబోయే రెండు మూడేళ్లు వరుస సినిమాల పండగ అని చెప్పొచ్చు. మరి ఈ సినిమాల లైనప్ ఏది ఎప్పుడన్నది తెలియదు కానీ ఈ సినిమాలన్నీ వస్తే ప్రభాస్ బాక్సాఫీస్ షేక్ చేయడం పక్కా అని చెప్పొచ్చు.