Begin typing your search above and press return to search.

కల్కి : వరల్డ్‌ వైడ్‌ గా నెం.2

ప్రభాస్ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొంది రెండు నెలల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన కల్కి 2898 ఏడీ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.

By:  Tupaki Desk   |   28 Aug 2024 5:14 AM GMT
కల్కి : వరల్డ్‌ వైడ్‌ గా నెం.2
X

ప్రభాస్ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొంది రెండు నెలల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన కల్కి 2898 ఏడీ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. దాదాపుగా రూ. వెయ్యి కోట్ల వసూళ్లు సాధించిన కల్కి సినిమా ప్రపంచ వ్యాప్తంగా హాలీవుడ్‌ ప్రేక్షకులను కూడా సర్‌ప్రైజ్ చేసిన విషయం తెల్సిందే. హాలీవుడ్‌ సినిమాలకు ఏమాత్రం తీసి పోకుండా ఉందంటూ జాతీయ స్థాయి రివ్యూవర్స్ కూడా కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతటి విజయాన్ని సొంతం చేసుకున్న కల్కి ఇప్పుడు ఓటీటీ వరల్డ్‌ లో సందడి చేస్తోంది.

అమెజాన్‌ ప్రైమ్‌ లో తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళ భాషల్లో కల్కి సినిమా స్ట్రీమింగ్‌ అవుతోంది. హిందీ వర్షన్‌ మాత్రం నెట్‌ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఒకే భాషలో నెట్‌ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌ అవుతున్నా కూడా అంతర్జాతీయ స్థాయిలో సందడి కొనసాగుతోంది. నాన్ ఇంగ్లీష్ జాబితాలో కల్కి సినిమా ట్రెండ్‌ అవుతోంది. నెట్‌ ఫ్లిక్స్ లో ప్రస్తుతం ఉన్న కంటెంట్‌ ల్లో అత్యధికంగా చూడబడుతున్న సినిమాగా కల్కి రెండో స్థానంలో నిలిచినట్లు తెలుస్తోంది. గత వారం నెట్‌ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌ అయిన ఈ సినిమా కు అప్పుడే 4.5 మిలియన్ల వ్యూస్ వచ్చాయని తెలుస్తోంది.

నాన్ ఇంగ్లీష్ జాబితాలో నెట్‌ ఫ్లిక్స్ లో కల్కి సినిమాకు నెం.2 స్థానం దక్కింది. రాబోయే రెండు మూడు వారాలు కూడా కల్కి సందడి నెట్‌ ఫ్లిక్స్ లో కొనసాగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కేవలం ఇండియాలోనే కాకుండా ప్రపంచంలోని పలు దేశాల్లో కల్కి సినిమాను సబ్‌ టైటిల్స్ తో చూస్తున్నారట. హాలీవుడ్ సినిమాకు ఏమాత్రం తక్కువ కాకుండా విభిన్నమైన కాన్సెప్ట్‌ తో రూపొందిన కల్కి సినిమాకు ఓటీటీ ప్రపంచంలో కూడా అద్భుతమైన విజయం దక్కింది అనేందుకు ఇదే నిదర్శనం.

కల్కి సినిమాలో ప్రభాస్ తో పాటు అమితాబచ్చన్‌, దీపికా పదుకునే, దిశా పటానీ, కమల్‌ హాసన్‌, శోభన, బ్రహ్మానందం ఇంకా ఎంతో మంది ప్రముఖ నటి నటులు నటించారు. ఫ్యూచర్ కి మహాభారతంను కనెక్ట్‌ చేసి దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ చూపించిన కల్కి కి థియేట్రికల్‌ రిలీజ్ లో భారీ స్పందన వచ్చింది. ఇప్పుడు ఓటీటీ లో కూడా అదే స్థాయి రెస్పాన్స్ దక్కడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ కి సలార్‌ తర్వాత వెంటనే కల్కి తో భారీ విజయం దక్కింది. కల్కి 2 కోసం ఇప్పుడు అంతా ఎదురు చూస్తున్నారు. నాగ్‌ అశ్విన్‌ కల్కి 2 ను ఎప్పటికి తీసుకు వస్తాడో చూడాలి.