'కల్కి 2898' జపాన్ లో డిజాస్టరా?
భారతీయ చిత్రాలకు చైనా, జపాన్ మార్కెట్ అత్యంత కీలకమైంది. ముఖ్యంగా అమీర్ ఖాన్, రజనీకాంత్, ప్రభాస్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలకు అక్కడ డిమాండ్ ప్రత్యేకమైంది.
By: Tupaki Desk | 22 Jan 2025 6:27 AM GMTభారతీయ చిత్రాలకు చైనా, జపాన్ మార్కెట్ అత్యంత కీలకమైంది. ముఖ్యంగా అమీర్ ఖాన్, రజనీకాంత్, ప్రభాస్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలకు అక్కడ డిమాండ్ ప్రత్యేకమైంది. అమీర్ ఖాన్ `దంగల్` 2000 కోట్లు కలెక్ట్ చేసిం దంటే? అందులో 1500 కోట్లు చైనా మార్కెట్ నుంచి కొల్లగొట్టింది. ఇంకా రజనీ కాంత్ రికార్డుల గురించైతే చెప్పాల్సిన పనిలేదు. ఆసియా ఖండంలో దేశాలన్నింటిలోనూ రజనీకాంత్ కు ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడదే క్రేజ్ ప్రభాస్ కు ఉంది.
విదేశాల నుంచి హైదరాబాద్ కి వచ్చి ప్రభాస్ కి బర్త్ డే విషెస్ చెబుతు న్నారంటే? డార్లింగ్ ని జపాన్ ఆడియన్స్ ఎంతగా ఆదరిస్తున్నారో? అక్కడ అద్దం పడుతుంది. `బాహుబలి` సినిమాతో ప్రభాస్ అంతర్జాతీయ మార్కెట్ ప్రారం భమైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి డార్లింగ్ నటించిన సినిమాలు చైనా, జపాన్ లో తప్పక రిలీజ్ అవుతు న్నాయి. తాజాగా ఇటీవలే `కల్కి 2898` కూడా రిలీజ్ అయింది. జనవరి 3న ఈ చిత్రం జపాన్‌లో భారీ స్థాయిలో విడుదలైంది.
కానీ ఫలితం మాత్రం ఆశాజనకంగా కనిపించలేదు. ఈ సినిమా ప్రీమియర్ కు ప్రభాస్ హాజరు కాలేకపోయినప్పటికీ దర్శకుడు నాగ్ అశ్విన్ సినిమా ప్రమోషన్ కోసం హాజరయ్యారు. కానీ `కల్కి 2898` జపాన్ ఆడియన్స్ కి మాత్రం కనెక్ట్ అవ్వలేదు. కల్కిని జపాన్ లో రిలీజ్ చేయడానికి ఓ ప్రత్యేక కారణం ఉంది. ఇది ఒక ఫాంటసీ ఫిక్షన్ చిత్రంగా భావించి జపనీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మేకర్స్ బలంగా నమ్మారు. కానీ ఫలితం మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. `కల్కి 2898` విడుదల రోజున 8.5 మిలియన్ యెన్‌లను (సుమారు ₹45 లక్షలు) రాబట్టింది.
ఆ తర్వాత వెంటనే వసూళ్లు డౌన్ అయ్యాయి. మొదటి వారంలో, సినిమా వసూళ్లు 1 నుండి 2 కోట్ల యెన్‌ల మధ్య నిలిచిపోయింది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం థియేట్రికల్ రన్‌ను ఊహించిన దానికంటే చాలా త్వరగా ముగించాల్సి ఉంటుందని భావిస్తోంది. అయితే ఇందుకు కొన్ని కారణాలు తెరపైకి వస్తున్నాయి. `కల్కి`లోని అశ్వత్థామ, కర్ణుడు , శ్రీకృష్ణుడి పాత్రలు భారతీయ పురాణాలలో ఎంతో గొప్పగా..లోతుగా చెప్పబడ్డాయి. ఇది జపాన్ ఆడియన్స్ కు అర్దం కాని కథగా మారింది. ఏ పాత్ర తీరు ఏంటో అర్దం కాని పరిస్థితి జపాన్ ఆడియన్స్ కి ఎదురైంది.