ప్రభాస్.. కన్నప్పలో కనిపించేది ఎంతసేపు?
మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. గ్యాప్ లేకుండా షూటింగ్స్ చేస్తూ ఈ సినిమాని మంచు విష్ణు అండ్ టీమ్ కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తోంది.
By: Tupaki Desk | 16 Dec 2024 4:30 PM GMTమంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. గ్యాప్ లేకుండా షూటింగ్స్ చేస్తూ ఈ సినిమాని మంచు విష్ణు అండ్ టీమ్ కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తోంది. భారీ బడ్జెట్ తో మంచు విష్ణు, మోహన్ బాబు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కీలక పాత్రల కోసం స్టార్ క్యాస్టింగ్ ని మంచు విష్ణు రంగంలోకి దించాడు. పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీ కథని స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ చేయాలని తనకున్న పరిచయాలని మంచు విష్ణు బలంగా ఉపయోగించుకుంటున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో మోహన్ బాబు, శరత్ కుమార్, మోహన్ లాల్ కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఇక బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఈ చిత్రంలో శివుడిగా కనిపించబోతున్నట్లు ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. భక్తిరస యాక్షన్ చిత్రం కాబట్టి శివుడి పాత్రకి ‘కన్నప్ప’ సినిమాలో మంచి ప్రాధాన్యత ఉండబోతోంది. అయితే ఆ పాత్ర నిడివి ఎంత సమయం ఉంటుందనేది క్లారిటీ లేదు.
ఇక ఈ సినిమాలో డార్లింగ్ ప్రభాస్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. రెమ్యునరేషన్ తీసుకోకుండానే ఈ సినిమాని మంచు విష్ణు కోసం ప్రభాస్ చేస్తున్నారు. ఇది చిన్న గెస్ట్ అప్పీరియన్స్ గా మాత్రమే ఉంటుందంట. 2, 3 రోజుల్లోనే ప్రభాస్ షూటింగ్ కంప్లీట్ చేసాడని తెలుస్తోంది. అలాగే సినిమాలో కూడా చాలా తక్కువ సమయం ప్రభాస్ కనిపిస్తారంట.
నిజానికి 20 నిమిషాల నిడివి ఉండే పాత్ర కోసం మేకర్స్ ప్రభాస్ ని అడిగారంట. అయితే అతని సినిమాలు షెడ్యూల్స్ ఉండటంతో ఎక్కువ నిడివి ఉన్న పాత్రలో చేయలేనని చెప్పినట్లు టాక్. దీంతో గెస్ట్ అప్పీరియన్స్ గా మాత్రమే ప్రభాస్ ఈ చిత్రంలో కనిపిస్తారని తెలుస్తోంది. పాత్ర నిడివి 5 నిమిషాలు మాత్రమే అనే టాక్ వస్తోంది. అందులో సగం షాట్స్ గ్రాఫిక్స్ తోనే ఉంటాయట. నందీశ్వరుడిగా ప్రభాస్ ఈ మూవీలో కనిపించబోతున్నట్లు సమాచారం. గతంలో ఈ సినిమా నుంచి ఆయన పాత్ర లుక్ లీక్ అయ్యింది. తరువాత మేకర్స్ జాగ్రత్త పడ్డారు.
అయితే ప్రభాస్ స్క్రీన్ టైం తక్కువగా ఉన్న కూడా ఆయన కనిపించిన సీన్స్ మాత్రం అదిరిపోయే రేంజ్ లో ఉంటాయనే మాట వినిపిస్తోంది. 2025 ఏప్రిల్ 25న ‘కన్నప్ప’ సినిమాని రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మోహన్ లాల్ కిరాత అనే క్యారెక్టర్ కనిపించబోతున్నారు. ఆయన ఫస్ట్ లుక్ ని తాజాగా రిలీజ్ చేశారు.