Begin typing your search above and press return to search.

ప్రభాస్‌ కాలి గాయం ఎఫెక్ట్ ఆ మూడు సినిమాలపై..!

ప్రభాస్‌ సలార్‌, కల్కి సినిమాలో భారీ విజయాలను సొంతం చేసుకున్న నేపథ్యంలో తదుపరి సినిమాల విషయంలో ఆసక్తి నెలకొంది.

By:  Tupaki Desk   |   17 Dec 2024 11:30 AM GMT
ప్రభాస్‌ కాలి గాయం ఎఫెక్ట్ ఆ మూడు సినిమాలపై..!
X

ప్రభాస్‌ సలార్‌, కల్కి సినిమాలో భారీ విజయాలను సొంతం చేసుకున్న నేపథ్యంలో తదుపరి సినిమాల విషయంలో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రాజాసాబ్‌ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. స్త్రీ 2 సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో అదే జోనర్‌లో రూపొందుతున్న రాజాసాబ్‌ సినిమా వెయ్యి కోట్ల సినిమా అంటూ ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. మారుతి అంచనాలకు తగ్గకుండా వరల్డ్‌ బిగ్గెస్ట్‌ హర్రర్‌ మూవీని రూపొందిస్తున్నాడు అనే నమ్మకంను నిర్మాత వ్యక్తం చేశారు.

రాజాసాబ్‌ సినిమాతో పాటు ఫౌజీ సినిమాను హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌గా నిలుస్తుంది అనే నమ్మకంను ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు. అంతటి నమ్మకం ఉన్న ఈ రెండు సినిమాలతో పాటు సందీప్ వంగ దర్శకత్వంలో స్పిరిట్‌ సినిమా మొదలు కాబోతుంది. 2025 ఆరంభంలోనే సినిమా పట్టాలెక్కాల్సి ఉంది. అదే ఏడాది ద్వితీయార్థంలో సినిమా షూటింగ్‌ పూర్తి కానుంది అంటూ భూషన్‌ కుమార్‌ ప్రకటించారు. కానీ ఈ మూడు సినిమాలు ప్రభాస్ కాలి గాయం కారణంగా ప్రభావితం అవుతున్నాయి.

ప్రభాస్‌ రాజాసాబ్‌ సినిమాను జనవరిలో పూర్తి చేసి ఏప్రిల్‌ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాల్సి ఉంది. కానీ ఆ పరిస్థితి లేదని ఇప్పుడు సమాచారం అందుతోంది. ప్రభాస్ గాయం కారణంగా కనీసం రెండు నెలల సమయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. దాంతో రాజాసాబ్‌ సినిమా షూటింగ్‌ చాలా ఆలస్యం కానుంది. అంతే కాకుండా డిసెంబర్‌ చివర్లో ఫౌజీ సినిమాకు డేట్లు ఇవ్వాలని ప్రభాస్ అనుకున్నాడు. కానీ ఫౌజీ సినిమాకు ఇప్పుడు డేట్లు ఇచ్చే పరిస్థితి లేదు. రాజాసాబ్‌, ఫౌజీ సినిమాలు కొలిక్కి వచ్చిన తర్వాత స్పిరిట్‌ సినిమాను పట్టాలెక్కించాలని ప్రభాస్ భావించాడు. కానీ ఆ రెండు సినిమాలు ఆగి పోవడం స్పిరిట్‌కు డేట్లు లేటు కావడం జరుగుతుంది.

ఇటీవల కల్కి సినిమా జపాన్‌ ప్రమోషన్‌ కి రావడం లేదు అంటూ అక్కడి ఫ్యాన్స్‌కి లేఖ రాసిన సమయంలో ప్రభాస్ తన కాలికి గాయం అయ్యిందని, విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా చెప్పాడు. సినిమా షూటింగ్‌ సమయంలో గాయం అయినా ఇప్పటి వరకు బయటకు రాలేదు. ప్రభాస్‌ ఆ విషయాన్ని చెప్తే కానీ తెలియదు. ఏ సినిమా షూటింగ్‌ సందర్భంగా గాయం అయ్యింది అనేది మాత్రం ప్రభాస్ క్లారిటీ ఇవ్వలేదు. కల్కి సినిమాను జపాన్‌లో భారీ ఎత్తున విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్‌ చేస్తున్నారు. నాగ్‌ అశ్విన్‌తో పాటు ఇతర యూనిట్‌ సభ్యులు జపాన్ వెళ్తున్నారు. జనవరి మొదటి వారంలోనే కల్కి 2898 ఏడీ సినిమా ప్రేక్షకుల ముందుకు వెళ్లబోతోంది.