Begin typing your search above and press return to search.

బడ్జెట్ ఎంత పెట్టినా వెనక్కి తెచ్చే ఒకే ఒక్కడు

ఈ మధ్య కాలంలో ప్రభాస్ సినిమాలకు తీస్తున్న బడ్జెట్లు చూస్తే వావ్ అనాల్సిందే. రాధేశ్యామ్, ఆది పురుష్, సలార్, కల్కి 2898 ఏడి.. ఇవేవీ చిన్న సినిమాలు కావు.

By:  Tupaki Desk   |   4 April 2025 3:26 PM
బడ్జెట్ ఎంత పెట్టినా వెనక్కి తెచ్చే ఒకే ఒక్కడు
X

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఎవరి మీద పెట్టుబడులు పెట్టాలన్నా ముందు హిట్స్, మార్కెట్, ఇమేజ్ అనే మూడు అంశాలను బేస్‌గా చూసుకుంటారు. కానీ ఓ హీరో మాత్రం అందరినీ దాటి, ఏ డైరెక్టర్‌తో చేసినా బడ్జెట్ విషయంలో తనను నమ్మించే స్థాయికి చేరుకున్నాడు. అతనే రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి తర్వాత ఆయన కెరీర్‌లో ఏ సినిమాలలైనా ఫలితాలు నెగటివ్ వచ్చినా, నిర్మాతలు మాత్రం అతని మీద ఉన్న నమ్మకాన్ని కొంచెం కూడా తగ్గించుకోలేదు.

ఇటీవల బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, డైరెక్టర్ అట్లీతో తన సినిమా స్క్రిప్ట్ రెడీ అయిందని, కానీ బడ్జెట్ కారణంగా ప్రాజెక్ట్‌కి బ్రేక్ వేయాల్సి వచ్చిందని అన్నారు. ఇది ఇండస్ట్రీలో బాగా చర్చనీయాంశం అయ్యింది. జవాన్ సినిమాతో వేల కోట్ల వసూళ్లు చేసిన డైరెక్టర్‌కి నిర్మాతలు బడ్జెట్ పెట్టడంలో వెనుకడుగు వేస్తే, ప్రభాస్ సినిమాలకు మాత్రం నిర్మాణ సంస్థలు వందల కోట్ల దూకుడుతో ముందుకు వెళ్తుండటం ఆశ్చర్యకరం.

ఈ మధ్య కాలంలో ప్రభాస్ సినిమాలకు తీస్తున్న బడ్జెట్లు చూస్తే వావ్ అనాల్సిందే. రాధేశ్యామ్, ఆది పురుష్, సలార్, కల్కి 2898 ఏడి.. ఇవేవీ చిన్న సినిమాలు కావు. ఒక్కో సినిమాకు రూ.300 కోట్ల నుంచి 600 కోట్ల వరకూ ఖర్చు చేస్తున్నారు. లేటెస్ట్ గా మిడ్ రేంజ్ సినిమాలు చేసిన మారుతి దర్శకత్వంలో 'రాజాసాబ్' అనే హారర్ ఎంటర్‌టైనర్‌కి రూ.400 కోట్ల బడ్జెట్ కేటాయించారంటేనే ప్రభాస్ మీద ఉన్న నమ్మక స్థాయి ఏంటో అర్థమవుతుంది.

ఇది కేవలం వసూళ్లకు సంబంధించిన విషయం కాదు. మేకర్స్‌కి ఉన్న గొప్ప నమ్మకం, ఆడియన్స్‌కు ప్రభాస్ మీద ఉన్న ఫెయిత్‌, విపరీతమైన ఓవర్సీస్ క్రేజ్.. ఇవన్నీ కలిసి నిర్మాతలు బడ్జెట్ పెట్టడంలో వెనకడుగు వేయకుండా చేస్తున్నారు. ఒక స్టార్ హీరో అంటేనే బడ్జెట్‌కు గ్యారంటీ. కానీ ప్రతి ఒక్కరు నిర్మాతకు నష్టం తలపెట్టకుండా బలమైన మార్కెట్ గ్యారంటీ ఇవ్వలేరు. ఈ విషయంలో ప్రభాస్ మాత్రం వేరే లెవెల్‌లో ఉన్నాడు.

ప్రభాస్ సినిమాలకు కంటెంట్ ఫెయిల్ అయినా ఓపెనింగ్స్‌ మాత్రం భారీ స్థాయిలో వస్తుంటాయి. ఇది నిర్మాతకు కనీస భద్రతగా మారుతుంది. అందుకే స్టార్ డైరెక్టర్ కాకపోయినా, కేవలం ప్రభాస్ ఉన్నాడన్న నమ్మకంతో నిర్మాతలు వందల కోట్లు ఖర్చు చేయడానికి వెనుకాడటం లేదు. ఇది ఇండస్ట్రీలో ఒక రేర్ కాంప్లిమెంట్ అని చెప్పాలి.

ఇవన్నీ చూస్తుంటే, ప్రభాస్ అంటే ప్రస్తుతం ఇండియన్ సినిమా నిర్మాతలకి రిస్క్‌ఫ్రీ హీరో లాంటి ఫీలింగ్ కలుగుతోంది. ఎంత పెద్ద బడ్జెట్ అయినా అతని సినిమా అంటే ఓ ప్రీమియం వాల్యూ ఉన్నట్టే. ఈ క్రమంలో త్వరలో విడుదల కాబోతున్న ‘కల్కి 2898 AD 2,‘రాజాసాబ్’, ‘సలార్ 2’, ‘స్పిరిట్’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తాయో చూడాలి.