Begin typing your search above and press return to search.

ప్రభాస్ పెళ్లి వార్తలపై బిగ్ క్లారిటీ.. ఆ ప్రచారం మొత్తం ఫేక్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త వైరల్ అవుతుండటం కొత్తేమీ కాదు.

By:  Tupaki Desk   |   27 March 2025 1:57 PM
Prabhas Wedding Rumors
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త వైరల్ అవుతుండటం కొత్తేమీ కాదు. ముఖ్యంగా పెళ్లి విషయానికి వస్తే, ఆయన పేరు అనేక సార్లు మీడియాలో హల్‌చల్ చేసింది. ‘బాహుబలి’ తర్వాత దేశవ్యాప్తంగా అభిమానుల సంఖ్య ఒక రేంజ్ లో పెరిగింది. దీంతో డార్లింగ్ కు సంబంధించిన గాసిప్స్ కూడా హాట్ టాపిక్ గా మారుతున్నాయి. అప్పుడప్పుడూ అనుష్క శెట్టి, కృతి సనన్ లాంటి కథానాయికల పేర్లు వైరల్ అవగా, అతని వ్యక్తిగత జీవితం పైన అనేక రకాల కథనాలు చర్చనీయాంశంగా మారాయి.

తాజాగా మరోసారి ప్రభాస్ పెళ్లి వార్తలు హాట్ టాపిక్ అయ్యాయి. ఈసారి ఆయన పెళ్లి హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారి కుమార్తెతో ఫిక్స్ అయ్యిందని వార్తలు వచ్చాయి. అంతేకాకుండా, ఈ పెళ్లిని కృష్ణం రాజు భార్య శ్యామలాదేవి చూసుకుంటున్నారన్న ప్రచారం జోరుగా నడిచింది. కొందరు దీనిపై అభినందనలు తెలియజేస్తే, మరికొందరు షాక్ అయ్యారు. పెళ్లి ముహూర్తాలు కూడా ఫిక్స్ అయ్యాయంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అయ్యాయి.

అయితే వీటన్నింటిపై ప్రభాస్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. “ఈ వార్తలు పూర్తిగా ఫేక్. దయచేసి అలాంటి రూమర్లను నమ్మవద్దు,” అంటూ ఆయన అధికార ప్రతినిధి వెల్లడించారు. అంతేకాకుండా, హైదరాబాద్ టీమ్ నుంచీ అదే విషయాన్ని ధ్రువీకరించారు. దీనితో పాటు, కొద్ది రోజుల క్రితం భీమవరం అమ్మాయిని పెళ్లి చేసుకుంటారన్న రూమర్‌ను కూడా కొట్టిపారేశారు. గతంలో అనుష్క శెట్టి, కృతి సనన్ లాంటి కథానాయికలతో సంబంధం ఉందన్న వార్తలపై కూడా ప్రభాస్ స్వయంగా ఖండించిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ప్రభాస్ సినిమా షెడ్యూళ్లతో బిజీగా ఉన్నాడు. ‘రాజాసాబ్’, ‘ఫౌజీ’, ‘స్పిరిట్’, ‘సలార్ 2’, ‘కల్కి 2’ వంటి ప్రాజెక్టులు వరుసగా లైన్‌లో ఉన్నాయి. ఒక్కో సినిమా బడ్జెట్ 300 కోట్ల పైనే ఉండడంతో, ఈ ప్రాజెక్టులపై ప్రభాస్ పూర్తిగా ఫోకస్ చేస్తున్నాడు. ఇప్పట్లో ఆయన వ్యక్తిగత జీవితానికి బ్రేక్ ఇచ్చేలా కనపడడం లేదు. ఈ సినిమాల్లోని పాత్రలు, గెటప్స్, కథల డిమాండ్ వల్ల ఏ ఒక్క సినిమాకు సమయం ఇవ్వడమే కాదు, ప్రమోషన్స్ కూడా పెద్ద సవాలుగా మారింది.

ముఖ్యంగా ‘కల్కి 2898 ఏడి’ వలన వచ్చిన క్రేజ్‌తో ప్రభాస్ ఏ దశలో ఉన్నాడో అందరికీ అర్థమవుతోంది. అలాంటిది ఈ టైంలో పెళ్లికి సంబంధించిన వార్తలు వైరల్ కావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక ఈ తరహా రూమర్లతో ప్రభాస్ టీమ్ రిపీట్ గా తలపడాల్సి వస్తోంది. ఇక ప్రభాస్ మాత్రం ఇప్పటివరకు పెళ్లి విషయంలో సరైన క్లారిటీ ఇవ్వలేదు. ఎప్పుడు ఆ ప్రశ్న ఎదురైనా కూడా ఏదో ఒక రీజన్ తో జంప్ అవ్వడం కామన్ గా మారింది. ఇక ఇలాంటి వార్తలపై ఎంత క్లారిటీ ఇచ్చినా కూడా ఆగేలా లేవు. ఇక నిజంగా పెళ్లికి రంగం సిద్ధమైతే.. ప్రభాస్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచిచూడడమే మంచిది.