Begin typing your search above and press return to search.

ప్రభాస్.. అటు పరామర్శలు, ఇటు శుభాకాంక్షలు!

ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ బిజీయెస్ట్ హీరోలలో ప్రభాస్ ఒకరు. వరుస ప్రాజెక్ట్స్ సైన్ చేస్తూ తీరికలేకుండా గడుపుతున్నారు.

By:  Tupaki Desk   |   9 Oct 2024 2:46 PM GMT
ప్రభాస్.. అటు పరామర్శలు, ఇటు శుభాకాంక్షలు!
X

ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ బిజీయెస్ట్ హీరోలలో ప్రభాస్ ఒకరు. వరుస ప్రాజెక్ట్స్ సైన్ చేస్తూ తీరికలేకుండా గడుపుతున్నారు. సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్న డార్లింగ్.. ఈరోజు సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ నివాసానికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు. అలానే ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ ఇంటికి వెళ్లి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు ప్రభాస్.

ఇటీవల రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో తాను అందుబాటులో లేకపోవడంతో, బుధవారం కూకట్ పల్లి ఇందు ఫార్చ్యూన్ విల్లాస్ లోని రాజేంద్రప్రసాద్ ఇంటికి వెళ్లి పరామర్శించారు ప్రభాస్. గాయత్రి చిత్ర పటానికి నివాళులు అర్పించారు. ప్రభాస్ ని పట్టుకొని రాజేంద్రప్రసాద్ కన్నీరు మున్నీరవ్వడంతో.. ధైర్యంగా ఉండు బాబాయ్ అంటూ ఓదార్చారు.

రాజేంద్ర ప్రసాద్ ను పరామర్శించిన తర్వాత ప్రభాస్ టాలీవుడ్ మాస్ డైరెక్టర్ వివి వినాయక్ ఇంటికి వెళ్ళారు. నేడు దర్శకుడి పుట్టినరోజు కావడంతో ఆయన్ను స్వయంగా కలిసి బర్త్ డే విషెస్ అందజేశారు. వినాయక్ తో కలిసి చాలా సమయం గడిపారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వచ్చాయి. ఇందులో ప్రభాస్, వినాయక్ ఇద్దరూ చాలా సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. ప్రస్తుతం ఈ పిక్ వైరల్ అవుతోంది.

టాలీవుడ్ లో ప్రభాస్ - వినాయక్ మధ్య మంచి బాండింగ్ ఉందనే విషయం తెలిసిందే. తమ మధ్య ఉన్న అనుబంధం గురించి అనేక సందర్భాల్లో చెప్పుకున్నారు. వీరిద్దరూ కాంబినేషన్ లో 'యోగి' అనే సినిమా వచ్చింది. ఇది బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. ఆ తర్వాత ప్రభాస్ తో మరో మూవీ చేసి హిట్ కొట్టాలని అనుకున్నాడు వినాయక్. కానీ ఎందుకనో మళ్ళీ ఈ కాంబో సెట్ అవ్వలేదు. అయినప్పటికీ వీరిమధ్య సాన్నిహిత్యం అలానే కొనసాగుతోంది.

ప్రభాస్ ప్రెజెంట్ మారుతి దర్శకత్వంలో 'ది రాజా సాబ్' సినిమా చేస్తున్నారు. విరామం లేకుండా షూటింగ్ చేసి వచ్చే నెలాఖరుకు సినిమాని పూర్తి చెయ్యాలని చూస్తున్నారు. దీని తర్వాత హను రాఘవపూడి మూవీ సెట్స్ లో అడుగుపెట్టనున్నారు. మరోవైపు 'ఛత్రపతి' హిందీ రీమేక్ తో ఫ్లాప్ చవిచూసిన వివి వినాయక్.. ఇప్పటివరకూ తన కొత్త చిత్రాన్ని ప్రకటించలేదు. ఇటీవల ఆయన ఆరోగ్యం దెబ్బతిందని, లివర్ సర్జరీ జరిగిందని వార్తలు వచ్చాయి. వినాయక్ త్వరలోనే తిరిగి పనిలో బిజీ అవ్వాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.