Begin typing your search above and press return to search.

ప్రభాస్ ఫౌజీ.. అప్పుడే 150 కోట్ల ఊచకోత

రెబల్ స్టార్ ప్రభాస్.. కొంత కాలంగా దేశ వ్యాప్తంగా మారుమోగుతున్న పేర్లలో ఇది కూడా ఒకటి.

By:  Tupaki Desk   |   25 Oct 2024 10:16 AM GMT
ప్రభాస్ ఫౌజీ.. అప్పుడే 150 కోట్ల ఊచకోత
X

రెబల్ స్టార్ ప్రభాస్.. కొంత కాలంగా దేశ వ్యాప్తంగా మారుమోగుతున్న పేర్లలో ఇది కూడా ఒకటి. అంతలా అతడు పాన్ ఇండియా స్టార్‌గా మారిన తర్వాత తనదైన రీతిలో సినిమాలు చేస్తూ ఎవరికి అందనంత ఎత్తుకు ఎదిగేలా దూసుకెళ్తున్నాడు. ఇలా ఇప్పటికే చాలా సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఈ బడా హీరో.. ఇప్పుడు కూడా మూడు నాలుగు ప్రాజెక్టులను ఏకకాలంలోనే చేస్తున్నాడు.

కొద్ది రోజుల క్రితమే రెండు మూడు సినిమాలు లైన్‌లో పెట్టుకున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ఇటీవలే హను రాఘవపూడితో కొత్త సినిమాను అధికారికంగా మొదలెట్టేశాడు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగిన సమయంలోనే ఇది నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అయింది. అప్పటి నుంచే ఈ సినిమా కోసం డార్లింగ్ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

రెబెల్ స్టార్ ప్రభాస్ - హను రాఘవపూడి కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఈ భారీ ప్రతిష్టాత్మక సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది అనే దానిపై ఇప్పటి వరకూ ఎలాంటి క్లారిటీ రాలేదు. కానీ, చిత్రీకరణను తాజాగా ప్రారంభించినట్లు ఓ న్యూస్ లీకైంది. అంతేకాదు, ఇందులో హీరో ప్రభాస్ కూడా పాల్గొంటున్నట్లు ఫిలిం నగర్ వర్గాల ద్వారా తెలిసింది.

వరల్డ్ వార్ నేపథ్యంతో సాగే స్వచ్చమైన ప్రేమకథతో రూపొందుతోన్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ మూవీ హక్కుల కోసం ఇప్పటి నుంచే తీవ్ర స్థాయిలో పోటీ కనిపిస్తోందని తెలిసింది. మరీ ముఖ్యంగా ప్రభాస్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ కోసం చాలా సంస్థలు పోటీలో నిలిచాయట. ఈ క్రమంలోనే తాజాగా ఓ బడా కంపెనీ వీటిని సొంతం చేసుకుందని న్యూస్ లీకైంది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ఈ పిరియాడిక్ మూవీకి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ఓ బడా సంస్థ ఏకంగా రూ. 150 కోట్లకు కొనుగోలు చేసిందట. షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ సైతం పూర్తి కాక ముందే ఈ చిత్రం రికార్డు ధరకు అమ్ముడుపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అదే సమయంలో ఈ వార్త నేషనల్ వైడ్‌గా ట్రెండింగ్ కూడా అవుతోంది.

ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి తెరకెక్కిస్తోన్న ఈ చిత్రానికి ‘ఫౌజీ’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ చిత్రంలో ఇమాన్వీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ క్రేజీ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి మ్యూజిక్ చేస్తున్నాడు.