నాని - ప్రభాస్.. ఇద్దరు ఇద్దరే
అతని మూవీ క్యాలెండర్ కూడా అలాగే సెట్ చేసుకున్నాడు. ప్రభాస్ చేతిలో ఉన్నన్ని సినిమాలు ఇండియాలో ఏ ఇతర హీరోకి లేవని చెప్పాలి.
By: Tupaki Desk | 8 Nov 2024 7:42 AM GMTఇండియన్ నెంబర్ వన్ హీరోగా ప్రభాస్ తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నారు. ప్రస్తుతం అతనికి 500+ కోట్ల మార్కెట్ ఉందనే మాట వినిపిస్తోంది. ఇతర హీరోలు అందరూ ఒక సినిమా చేయడానికి రెండు, మూడేళ్లు సమయం తీసుకుంటూ ఉంటే ప్రభాస్ ప్రతి ఏడాది కచ్చితంగా ఒక సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకొని వస్తున్నాడు. అతని మూవీ క్యాలెండర్ కూడా అలాగే సెట్ చేసుకున్నాడు. ప్రభాస్ చేతిలో ఉన్నన్ని సినిమాలు ఇండియాలో ఏ ఇతర హీరోకి లేవని చెప్పాలి.
ఏకంగా ఐదు సినిమాలు ప్రభాస్ లైన్ అప్ లో ఉన్నాయి. ఈ సినిమాలన్నింటి బడ్జెట్ 3000 కోట్ల పైనే ఉండొచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. భారీ బడ్జెట్ సినిమాలు చేస్తోన్న కూడా ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా ఒకదాని తర్వాత ఒకటిగా మూవీస్ ని కంప్లీట్ చేసే పనిలో ప్రభాస్ ఉన్నారు. ప్రస్తుతం ప్రభాస్ ది రాజాసాబ్ మూవీ షూటింగ్ లో ఉన్నారు. రీసెంట్ గా సలార్ మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ చేశారని టాక్ వినిపించింది.
మరో వైపు హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఫౌజీ కూడా సెట్స్ పైనే ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత ప్రభాస్ ఈ మూవీ షూటింగ్ లో జాయిన్ అవుతారనే ప్రచారం నడుస్తోంది. ఇలా మూడు సినిమాలు సెట్స్ పైన ఉండగానే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ మూవీ షూటింగ్ కూడా ప్రభాస్ స్టార్ట్ చేస్తాడనే టాక్ తెరపైకి వచ్చింది. డిసెంబర్ లో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుందని నిర్మాత భూషణ్ కుమార్ చెప్పారు.
ప్రభాస్ చేస్తోన్న ప్రతి సినిమాలో భిన్నమైన లుక్, డిఫరెంట్ బాడీ షేప్ లో కనిపించాల్సి ఉంటుంది. అయిన కూడా ఇన్ని సినిమాల షూటింగ్ ఒకేసారి ఎలా హ్యాండిల్ చేస్తున్నాడనే ప్రశ్న వినిపిస్తోంది. ప్రభాస్ తరహాలోనే మీడియం రేంజ్ హీరోలలో నేచురల్ స్టార్ నాని కూడా ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. అలాగే రెండు, మూడు సినిమాలు లైన్ అప్ లో పెట్టుకున్నాడు. ప్రస్తుతం నాని హిట్ 3 మూవీ షూటింగ్ లో ఉన్నారు. ఇది పూర్తి చేసిన వెంటనే శ్రీకాంత్ ఓదేల దర్శకత్వంలో సినిమాని పట్టాలెక్కిస్తాడు.
దాని తర్వాత సుజిత్ దర్శకత్వంలో ఒక మూవీ సిద్ధంగా ఉంది. వీటి మధ్యలో శివ నిర్వాణ దర్శకత్వంలో ఒక సినిమా కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇలా స్ట్రాంగ్ లైన్ అప్ సెట్ చేసుకొని ఏడాదికి ఒక సినిమాని నాని కూడా ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మిగిలిన స్టార్స్ కి సాధ్యం కానిది బిగ్ హీరోలలో ప్రభాస్, మీడియం రేంజ్ లో నానికి ఏడాదికి ఒక సినిమా అందించడం ఎలా సాధ్యం అవుతుందని మాట్లాడుకుంటున్నారు. వీరిని చూసి మిగిలిన స్టార్స్ అందరూ మూవీస్ ప్లానింగ్ చేసుకోవాలనే కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.