Begin typing your search above and press return to search.

మరోసారి రామాయణం కథలో ప్రభాస్.. ఏంటీ మ్యాటర్?

రామాయణం కథకి తన కల్పన జోడించి బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ 'ఆదిపురుష్' మూవీ చేశారు.

By:  Tupaki Desk   |   27 Sep 2024 6:58 AM GMT
మరోసారి రామాయణం కథలో ప్రభాస్.. ఏంటీ మ్యాటర్?
X

రామాయణం ఆధారంగా ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు, సీరియల్స్ వచ్చాయి. ఎన్ని వచ్చిన మళ్ళీ మళ్ళీ శ్రీరాముడి చరిత్రని చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అందుకే రామాయణం ఆధారంగా ఇప్పటికి మూవీస్ చేయడానికి మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. రామాయణం కథకి తన కల్పన జోడించి బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ‘ఆదిపురుష్’ మూవీ చేశారు. ఈ సినిమాలో శ్రీరాముడిగా ప్రభాస్ నటించాడు.

ఆ పాత్రలో ప్రభాస్ ని ప్రెజెంట్ చేసిన విధానం అస్సలు బాగోలేదనే విమర్శలు వచ్చాయి. అలాగే రామాయణం కథని పూర్తిగా వక్రీకరించి ఇష్టానుసారంగా సినిమాటిక్ లిబర్టీ తీసుకొని ‘ఆదిపురుష్’ చేశారనే ఆరోపణలు వచ్చాయి. ‘ఆదిపురుష్’ సినిమాని ప్రేక్షకులు కూడా యాక్సప్ట్ చేయలేదు. దీంతో మూవీ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మారింది. ఈ ‘ఆదిపురుష్’ సినిమా కారణంగా ప్రభాస్ దారుణమైన ట్రోలింగ్ కి గురయ్యాడు.

దీంతో ప్రభాస్ మరోసారి రామాయణం కథ జోలికి వెళ్లడని అందరూ అనుకున్నారు. అయితే డార్లింగ్ ప్రభాస్ మరోసారి ‘రామాయణం’ లో నటించబోతున్నాడనే ప్రచారం ఇప్పుడు తెరపైకి వచ్చింది. నితీష్ తివారి దర్శకత్వంలో రణబీర్ కపూర్, సాయి పల్లవి జోడీగా ‘రామాయణం’ మూవీ తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రంలో లార్డ్ పరశురాముడి పాత్ర కోసం ప్రభాస్ ని మేకర్స్ సంప్రదించినట్లు టాక్ వినిపిస్తోంది.

పరశురాముడి క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా, గంభీరంగా ఉంటుంది. ఆ క్యారెక్టర్ ని కరెక్ట్ గా చూపించాలంటే మంచి కటౌట్ ఉన్న స్టార్ అయితే బాగుంటుందని ప్రభాస్ ని అడిగారంట. డార్లింగ్ కూడా పరశురాముడి క్యారెక్టర్ చేయడానికి ఒకే చెప్పాడా లేదా అనే విషయంలో ఇంకా సరైన క్లారిటీ అయితే రాలేదు. త్వరలో ఈ క్యారెక్టర్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందని బిటౌన్ లో వినిపిస్తోంది.

ఒక వేళ ఈ వార్త నిజమైతే మాత్రం కచ్చితంగా ‘రామాయణం’ సినిమాకి ఊహించని క్రేజ్ వస్తుంది. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, ప్రభాస్ పరశురాముడిగా, రాకింగ్ స్టార్ యష్ రావణుడి పాత్రలో కనిపిస్తే చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు. ముగ్గురు పాన్ ఇండియా స్టార్స్ ఒకే సినిమాలో అంటే దేశ వ్యాప్తంగా ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని ట్రేడ్ పండితులు కూడా అంటున్నారు. అయితే ‘రామాయణం’ కథను ఒకసారి టచ్ చేసి ట్రోలింగ్ ఎదుర్కొన్న ప్రభాస్ మరోసారి అలాంటి కథలో భాగం అవుతాడో లేదో చూడాలి.