సలార్ 2 మరింత లేట్..!
రాజా సాబ్ చివరి దశకు చేరుకోగా ఫౌజీ సినిమాను కూడా శరవేగంగా షూట్ చేస్తున్నాడు ప్రభాస్.
By: Tupaki Desk | 14 Feb 2025 3:30 AM GMTరెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలైతే కమిట్ అవుతున్నాడు కానీ వాటికి సంబంధించిన షూటింగ్స్ మాత్రం లేట్ అవుతూ వస్తుంది. ప్రభాస్ రాజా సాబ్ సినిమా ఇప్పటికే సెట్స్ మీదకు వెళ్లి రెండేళ్లు అవుతుంది. ఆ సినిమా అసలైతే ఏప్రిల్ లో రిలీజ్ అనుకున్నా ఇప్పుడు ఆ డేట్ కష్టమే అని తెలుస్తుంది. ఇక మరోపక్క హను రాఘవపూడితో ఫౌజీ సినిమా కూడా సెట్స్ మీద ఉంది. రాజా సాబ్ చివరి దశకు చేరుకోగా ఫౌజీ సినిమాను కూడా శరవేగంగా షూట్ చేస్తున్నాడు ప్రభాస్.
ఇక నెక్స్ట్ ప్రభాస్ సందీప్ వంగ డైరెక్షన్ లో చేయబోతున్న స్పిరిట్ సినిమాను కూడా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతుందని తెలుస్తుంది. దీనితో పాటు కల్కి 2 కూడా చేయాల్సి ఉంది. ఐతే స్పిరిట్ సినిమా ఈ ఇయర్ ఎండింగ్ లో మొదలై నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ వరకు షూట్ జరుగుతుంది. మధ్యలో కల్కి 2 ని మొదలు పెట్టి దాన్ని పూర్తి చేస్తాడని తెలుస్తుంది. ఐతే ప్రభాస్ సినిమాల లిస్ట్ లో ఇంకా సలార్ 2 కూడా ఉంది. సలార్ 2 సినిమా ను ప్రశాంత్ నీల్ సలార్ 1 కన్నా భారీగా తెరకెక్కించే ప్లానింగ్ లో ఉన్నాడు.
ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో సినిమాకు రెడీ అవుతున్నాడు. తారక్ డేట్స్ ఇవ్వడమే ఆలస్యం సినిమాను మొదలు పెట్టబోతున్నాడు. ఐతే ఈ సినిమా ఎలా లేదన్నా కూడా రెండేళ్లు పట్టే ఛాన్స్ ఉంది. సో సలార్ 2 కన్నా ముందు ఎన్టీఆర్ సినిమా చేస్తాడు. ఐతే తారక్ సినిమా కూడా రెండు భాగాలు చేసే ఆలోచన ఉన్నట్టు తెలుస్తుంది. సో ఎలా లేదన్నా సలార్ 2 సినిమా 2028 లోనే సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.
వీటితో పాటు ప్రభాస్ దిల్ రాజు తో ఒక సినిమా ప్లానింగ్ లో ఉన్నాడు. ఐతే ఆ సినిమా కూడా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఉంటుందన్న టాక్ వినిపిస్తుంది. సో ఐదారేళ్ల దాకా ప్రభాస్ కొత్త సినిమా కమిట్ అయ్యే ఛాన్స్ లేకుండా ఫుల్ బిజీ అయ్యాడని చెప్పొచ్చు. రాబోయే సినిమాలన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ అనిపించేలా ఉన్నాయి. ఐతే ఈ సినిమాలన్నీ కూడా రెబల్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఫుల్ మాస్ ఫీస్ట్ అందిస్తాయని చెప్పొచ్చు. ప్రభాస్ సినిమాల లైనప్ చూసి ఫ్యాన్స్ కి సూపర్ కిక్ వస్తుంది. లెక్క తప్పకుండా పాన్ ఇండియా రేంజ్ లో తన ఫాం కొనసాగించాలని చూస్తున్నాడు ప్రభాస్.