Begin typing your search above and press return to search.

ప్రభాస్‌ 'హనుమాన్‌' కాంబో సంక్రాంతి అప్‌డేట్‌..!

ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో రూపొందబోతున్న ప్రభాస్ సినిమాను 2025 జనవరిలో సంక్రాంతి సందర్భంగా ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.

By:  Tupaki Desk   |   14 Dec 2024 10:30 AM GMT
ప్రభాస్‌ హనుమాన్‌ కాంబో సంక్రాంతి అప్‌డేట్‌..!
X

ప్రభాస్‌ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు, చేయాల్సిన సినిమాలు చాలానే ఉన్నాయి. బ్యాక్ టు బ్యాక్ సలార్‌, కల్కి 2898 ఏడీ సినిమాలతో విజయాలను సొంతం చేసుకున్న ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజాసాబ్‌ సినిమాను చేస్తున్నారు. మరో వైపు సీతారామం సినిమా దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమాను చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కాకుండా ప్రభాస్ ఇప్పటికే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో 'స్పిరిట్‌', ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో 'సలార్‌ 2', నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో 'కల్కి 2898 ఏడీ' సీక్వెల్‌ చేయాల్సి ఉంది. ఈ సినిమాలతో పాటు ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో ఒక సినిమాను ప్రభాస్ చేసేందుకు ఓకే చెప్పాడు.

హనుమాన్ సినిమాతో సూపర్‌ హిట్‌ దక్కించుకుని బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలకు కమిట్‌ అయిన ప్రశాంత్‌ వర్మ మొదట బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా సినిమా చేస్తాడనే వార్తలు వచ్చాయి. అధికారికంగా ప్రకటన సైతం వచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా సైడ్‌ అయ్యింది. అందుకే ప్రశాంత్ వర్మ వెంటనే ప్రభాస్ హీరోగా సినిమాను మొదలు పెట్టబోతున్నాడని సమాచారం అందుతోంది. ప్రస్తుతం స్పీడ్‌గా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ జరుపుతున్న ప్రశాంత్‌ వర్మ అతి త్వరలోనే సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి.

ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో రూపొందబోతున్న ప్రభాస్ సినిమాను 2025 జనవరిలో సంక్రాంతి సందర్భంగా ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఈ సంక్రాంతికి ప్రారంభించి 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్రశాంత్‌ వర్మ ప్లాన్‌ చేస్తున్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకుంటున్న ప్రభాస్, విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరున్న ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో సినిమా చేయబోతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి. ఒక రియల్‌ సూపర్‌ హీరో కథతో ప్రశాంత్‌ నీల్‌ సినిమా ప్రభాస్‌తో ఉంటుంది అనే వార్తలు వస్తున్నాయి.

హనుమాన్‌ సినిమాకి సీక్వెల్‌గా రూపొందుతున్న జై హనుమాన్ సినిమా షూటింగ్‌ ఇప్పటికే ప్రారంభం అయ్యింది. త్వరలోనే ఆ సినిమా విడుదల తేదీ పై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. 2025లో ఏ క్షణంలో అయినా జై హనుమాన్‌ విడుదల ఉంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. హనుమాన్‌ సినిమా సీక్వెల్‌గా జై హనుమాన్‌ రూపొందిస్తున్న ప్రశాంత్‌ వర్మ ఎలా ప్రభాస్‌ సినిమాను పట్టాలెక్కిస్తాడు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ విషయమై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.