మూడవ చిత్రమే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తోనా!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా ప్రశాంత్ వర్మ ఓ భారీ చిత్రానికి సన్నాహాలు చేస్తోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 1 March 2025 11:48 AM GMTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా ప్రశాంత్ వర్మ ఓ భారీ చిత్రానికి సన్నాహాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్టోరీ లాక్ అయింది. ఇద్దరు సరికొత్త కాన్సెప్ట్ తో రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రశాంత్ వర్మ ఓవైపు `జై హనుమాన్ `షూట్ లో బిజీగా ఉంటూనే ఖాళీ సమయంలో ప్రభాస్ సినిమాకి సంబంధిం చిన పనుల్లోనూ నిమగ్నమవుతున్నాడు. ఇప్పటికే పాక్షికంగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతోంది.
దీనిలో భాగంగా హీరోయిన్ ఎంపిక పై మేకర్స్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ప్రభాస్ కి జోడీగా ముంబై బ్యూటీ భాగ్య శ్రీ బోర్సేను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. తాజాగా భాగ్య శ్రీ బోర్సేపై లుక్ టెస్ట్ కూడా చేసారుట. అయితే డార్లింగ్ సరసన బోర్సే బ్యూటీ ఫిట్ అయిందా? లేదా? అన్నది ఇంకా కన్పర్మేషన్ రాలేదు. ఎంపికైతే మాత్రం అమ్మడు దశ తిరిగినట్లే. కెరీర్ ఆరంభంలోనే పాన్ ఇండియా స్టార్ సరసన నటించే ఛాన్స్ అంటే చిన్న విషయమా? `మిస్టర్ బచ్చన్` సినిమాతో భాగ్య శ్రీ బోర్సే టాలీవుడ్ లో లాంచ్ అయిన సంగతి తెలిసిందే.
కానీ తొలి సినిమా నిరాశనే మిగిల్చింది. నటిగా మాత్రం మంచి మార్కులు వేయించుకుంది. భార్య పెర్పార్మెన్స్ కి తొలి సినిమాతోనే అభిమానులు ఏర్పడ్డారు. అమ్మడి అభినయానికి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన `కింగ్ డమ్` లో నటిస్తోంది. ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్ . సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మూడవ చిత్రంగా ప్రభాస్ సినిమాలో ఛాన్స్ ఒకే అయితే అదృష్ట వంతురాలే.
డార్లింగ్ సరసన నటించాలని ఎంతో మంది భామలు ఎదురు చూస్తున్నారు. ఈ లిస్ట్ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు సైతం క్యూలో ఉన్నారు. వాళ్లందర్నీ పక్కనబెట్టి భాగ్య శ్రీని ఎంపిక చేస్తున్నారంటే ప్రతిభతో పాటు లక్కీ గాళ్ అయితేనే సాధ్యమవుతుంది. భాగ్య శ్రీ యారియాన్ 2 తో బాలీవుడ్ లో ఇప్పటికే ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.