Begin typing your search above and press return to search.

ప్రభాస్‌ లుక్‌ టెస్ట్‌... ఫలితం ఇదే!

యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ప్రస్తుతం చాలా సినిమాలు చేస్తున్నారు. ఆ సినిమాలు వివిధ దశల్లో ఉన్నాయి.

By:  Tupaki Desk   |   27 Feb 2025 6:15 AM GMT
ప్రభాస్‌ లుక్‌ టెస్ట్‌... ఫలితం ఇదే!
X

యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ప్రస్తుతం చాలా సినిమాలు చేస్తున్నారు. ఆ సినిమాలు వివిధ దశల్లో ఉన్నాయి. ఈ ఏడాదిలో మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రాజాసాబ్‌ సినిమా విడుదల కానుంది. సమ్మర్‌ చివరి వరకు రాజాసాబ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఫౌజీ సినిమాను సైతం ఇదే ఏడాది చివరి వరకు విడుదల చేయాలని భావిస్తున్నారు. వచ్చే ఏడాది సైతం ప్రభాస్ సినిమాలు లైన్‌గా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. స్పిరిట్‌, కల్కి 2, సలార్‌ 2 సినిమాల షూటింగ్స్ చేయాల్సి ఉండగా ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో సినిమాకు ప్రభాస్ ఓకే చెప్పాడు.

మోక్షజ్ఞ సినిమాను క్యాన్సల్‌ చేసుకున్న ప్రశాంత్‌ వర్మ తన తదుపరి సినిమాను ప్రభాస్‌తో కన్ఫర్మ్‌ చేశాడని టాలీవుడ్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. జై హనుమాన్‌ సినిమా ముగింపు దశకు వచ్చింది. వచ్చే ఏడాదిలో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదే సమయంలో ప్రభాస్‌తో సినిమాకు సైతం ప్రశాంత్‌ వర్మ రెడీ అవుతున్నాడు. ఇటీవల సినిమా కోసం ప్రభాస్ లుక్‌ టెస్ట్‌కి హాజరు అయ్యాడు. సాధారణంగా ప్రభాస్ వంటి స్టార్‌ హీరో లుక్‌ టెస్ట్‌కి హాజరు కావాల్సిన అవసరం లేదు. కానీ విభిన్నమైన గెటప్‌లో కనిపించాల్సి వస్తే అప్పుడు లుక్ టెస్ట్‌ తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. రెండు మూడు వేరియేషన్స్‌లో లుక్‌ టెస్ట్‌ చేస్తారు.

ప్రశాంత్‌ వర్మ సినిమా కోసం ప్రభాస్ లుక్‌ టెస్ట్‌ పూర్తి అయింది. ఒక లుక్‌ను ఫైనల్‌ చేశారు. ప్రభాస్ ఆ పాత్రకు సెట్‌ అవుతాడు అనే నమ్మకం ప్రశాంత్‌ వర్మకు కలిగిందట. అందుకే తదుపరి స్టెప్‌కి రెడీ అవుతున్నారు. హంబులే నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మించబోతుందని తెలుస్తోంది. ప్రభాస్‌తో సలార్‌ సినిమాను నిర్మించిన ఈ నిర్మాణ సంస్థ ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌ సినిమాకు రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రభాస్‌, ప్రశాంత్ వర్మ కాంబో మూవీ గురించి సోషల్‌ మీడియాలో, సినీ సర్కిల్స్‌లో రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా కథను మొదట రణ్వీర్‌ సింగ్‌కు ప్రశాంత్ వర్మ చెప్పాడట.

గత ఏడాదిలో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రణ్వీర్‌ సింగ్‌ సినిమా చర్చలు జరిగాయి. అధికారికంగా ప్రకటన వచ్చే సమయంలో కొన్ని విభేదాల కారణంగా ప్రాజెక్ట్‌ను పక్కకు పెట్టాల్సి వచ్చింది. కారణం ఏంటి అనేది ఏ ఒక్కరూ చెప్పలేదు. కానీ ప్రశాంత్‌ వర్మ అదే కథను ఇప్పుడు ప్రభాస్‌కి చెప్పి ఒప్పించారని, రాక్షస్‌ టైటిల్‌తో ఈ సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అధికారికంగా ఈ సినిమా గురించి క్లారిటీ రావాల్సి ఉంది. ప్రభాస్‌ ప్రస్తుతం ఉన్న బిజీ కారణంగా వచ్చే ఏడాదిలోనే ఈ సినిమా ఉండే అవకాశాలు ఉన్నాయి. మరో వైపు ప్రశాంత్‌ వర్మ సైతం 'జై హనుమాన్‌' షూటింగ్‌ పూర్తి చేయాల్సి ఉంది. కనుక వీరి కాంబో మూవీ లుక్ టెస్ట్‌ పాస్ అయినా పట్టాలు ఎక్కడానికి సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి.