Begin typing your search above and press return to search.

స్వీటీ కోసం డార్లింగ్ దిగాల్సిందే!

అయితే ఇంత వ‌ర‌కూ ఈ సినిమాకి ఏమాత్రం బ‌జ్ రాలేదు. మేక‌ర్స్ సైతం ఎలాంటి అప్ డేట్స్ కూడా అందివ్వ‌క‌పోవ‌డంతో సినిమా పై మినిమం బ‌జ్ కూడా క్రియేట్ అవ్వ‌లేదు.

By:  Tupaki Desk   |   11 Jan 2025 4:00 AM GMT
స్వీటీ కోసం డార్లింగ్ దిగాల్సిందే!
X

స్వీటీ అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో వాస్త‌వ సంఘ‌ట‌న‌లు ఆధారంగా క్రిష్ `ఘాటీ` చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే షూటింగ్ 80 శాతం పూర్త‌యింది. పెండింగ్ షూట్ కూడా వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇంత వ‌ర‌కూ ఈ సినిమాకి ఏమాత్రం బ‌జ్ రాలేదు. మేక‌ర్స్ సైతం ఎలాంటి అప్ డేట్స్ కూడా అందివ్వ‌క‌పోవ‌డంతో సినిమా పై మినిమం బ‌జ్ కూడా క్రియేట్ అవ్వ‌లేదు. పైగా అనుష్క చాలా గ్యాప్ త‌ర్వాత చేస్తోన్న చిత్రం.

ఇప్ప‌టికే అనుష్క పేరు మ‌ర్చిపోయే ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఆమె కూడా సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉండ‌దు. సినిమా విశేషాలు గానీ, వ్య‌క్తిగ‌త విష‌యాలు గానీ ఏవీ రివీల్ చేయ‌దు. దీంతో అనుష్క‌కి ఇదో మైన‌స్ గానూ మారింది. ఈ నేప‌థ్యంలో ఈ సినిమా ప్ర‌చారం బాధ్య‌త‌లు ప్ర‌ధానంగా డార్లింగ్ ప్ర‌భాస్ నెత్తిన ప‌డే అవ‌కాశం లేక‌పోలేదు. ఆయ‌న కూడా బాధ్య‌త‌గా ప్ర‌చారం చేయాల్సిన అవ‌స‌రం క‌నిపిస్తుంది.ఈ సినిమా నిర్మిస్తుంది యూవీ క్రియేష‌న్స్. అంటే ప్ర‌భాస్ సొంత నిర్మాణ సంస్థ లాంటింది.

ఆ సంస్థ సినిమాల్ని తానెప్పుడు ప్ర‌మోట్ చేస్తుంటాడు. కానీ `ఘాటీ` కోసం ఇంకాస్త ఎక్కువ‌గానే డార్లింగ్ ప‌ని చేయాలి. బ్యాన‌ర్ హోమ్ లాంటిదైతే అనుష్క అత‌డికి మంచి స్నేహితురాలు. ఇద్ద‌రు క‌లిసి మంచి హిట్ సినిమాలు చేసారు. హీరోయిన్లు అంద‌రికంటే అనుష్క అంటే డార్లింగ్ స్పెష‌ల్. ఇప్ప‌టికే అనుష్క‌ డౌన్ పాల్ లోనూ ఉంది. ఆ సినిమా జ‌నాల్లోకి బ‌లంగా వెళ్లాలంటే ప్ర‌భాస్ సినిమా తో పాటు అనుష్క‌ని వ్య‌క్తిగ‌తంగానూ ప్ర‌మోట్ చేయాలంటున్నారు.

మ‌రి డార్లింగ్ తో ప్ర‌చారాన్ని యూవీ ఎలా ప్లాన్ చేస్తుంది అన్న‌ది చూడాలి. ప్ర‌చారం ప‌నులు మొద‌లైతే మాత్రం అన్నింటా ప్ర‌భాస్ క‌నిపించాలి. రిలీజ్ వ‌ర‌కూ ప్ర‌భాస్ పూర్తి స‌హ‌కారం అందించాలంటున్నారు. మ‌రి ప్ర‌భాస్ బిజీ షెడ్యూల్ న‌డుమ సాధ్య‌మ‌వుతుందా? లేదా? అన్న‌ది చూడాలి. ప్ర‌స్తుతం అత‌డు వ‌రుస షూటింగ్ ల‌తో బిజీగా ఉన్నారు. `పౌజీ`, `రాజాసాబ్` సెట్స్ లో ఉన్నాయి. ఘాటీ ప్ర‌చారం మొద‌ల‌య్యే స‌మ‌యానికి స్పిరిట్ కూడా ప‌ట్ట‌లెక్కుతుంద‌ని వినిపిస్తుంది. మ‌రి ఘాటీ ప్ర‌చారాన్ని ఎలా మ్యానేజ్ చేస్తారో చూడాలి.