Begin typing your search above and press return to search.

రాజాసాబ్ పై మారుతి కాన్పిడెన్స్ ఏ రేంజ్ లో ఉందంటే!

అయితే ఈ సినిమా ఆల‌స్య‌మ్యే కొద్ది ప్రాజెక్ట్ పై ఆ నెగిటివిటీ అంతా పాజిటివ్ గా మారుతుంది.

By:  Tupaki Desk   |   27 March 2025 8:30 AM
Maruthi Shares Exciting Update
X

ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా మారుతి ద‌ర్శ‌క‌త్వంలో `రాజాసాబ్` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. తొలుత పాన్ ఇండియా స్టార్ మారుతితో సినిమా ఏంటి? అనే చిన్న‌పాటి విమ‌ర్శ వ్య‌క్త‌మైంది. భారీ యాక్ష‌న్ స్టార్ తో మారుతి ఎలాంటి అటెంప్ట్ చేస్తున్నాడ‌నే టెన్ష‌న్ అభిమానుల్లో క‌నిపించేది. అయితే ఈ సినిమా ఆల‌స్య‌మ్యే కొద్ది ప్రాజెక్ట్ పై ఆ నెగిటివిటీ అంతా పాజిటివ్ గా మారుతుంది.

`రాజాసాబ్` ఎలా ఉండబోతుంది? అనే ఓ ఎగ్టైట్ మెంట్ ప్రేక్ష‌కుల్లో మొద‌లైంది. అటుపై రిలీజ్ అయిన ప్ర‌భాస్ ఫ‌స్ట్ లుక్ స‌హా ఇత‌ర ప్ర‌చార చిత్రాలు..స్లోరీ లైన్ ఇలా ప్ర‌తీది సినిమాపై మంచి అంచ‌నాలు క్రియేట్ చేస్తుంది. తాత‌-మ‌న‌వుడిగా డార్లింగ్ డ్యూయెల్ రోల్ పోషించడం స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌రంగా మారింది. ప్ర‌భాస్ లుక్ స‌హా ప్రతీది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక ఈ సినిమా రిలీజ్ స‌మ‌యం కూడా ద‌గ్గ‌ర‌ప‌డింది.

ఇప్ప‌టికే బాగా ఆల‌స్య‌మైన నేప‌థ్యంలో వీలైనంత త్వ‌ర‌గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రావాల‌ని స‌న్నాహాలు చేస్తున్నారు. చిత్రీక‌ర‌ణ కూడా ముగింపు ద‌శ‌కు చేరుకుంది. ఈ నేప‌థ్యంలో ఓ సినిమా ఈవెంట్ కు హాజ‌రైన మారుతి రాజాసాబ్ గురించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందించారు. తాను ఈ సినిమాను ఎంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్నాడు అన్న‌ది రివీల్ చేసాడు.

`నా నుంచి ప్రేక్ష‌కులు ఏం కోరుకుంటున్నారో? అదే ఈ సినిమాలో ఉంటుంది. ప్ర‌భాస్ గారి నా నుంచి ఏం కోరుకుంటున్నారో? అది తెలిసి చేస్తోన్న చిత్ర‌మిది. అన్ని అంశాలున్న మంచి చిత్ర‌మిది. ఇలాంటి సిని మా తీస్తున్నందుకు సంతోషంగా ఉంది. 100 శాతం చాలా సంతృప్తిగా ఉన్నాను. ఈసినిమా విష‌యం లో ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ప‌నిచేస్తున్నాను` అని అన్నారు. దీంతో ఈ సినిమా విష‌యంలో అభి మానులు ఎలాంటి ఆందోళ‌న‌కు గురికావాల్సిన ప‌నిలేద‌న్న సందేశాన్ని మారుతి పంపించిన‌ట్లు అయింది.