Begin typing your search above and press return to search.

రాజాసాబ్‌ హిట్‌ గ్యారెంటీ.. స్త్రీ సాక్ష్యం

ప్రస్తుతం హర్రర్‌ కామెడీ సినిమాల ట్రెండ్‌ నడుస్తోంది. అన్ని భాషల నుంచి క్రమం తప్పకుండా వరుసగా హర్రర్‌ కామెడీ సినిమాలు వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   14 Sep 2024 6:55 AM GMT
రాజాసాబ్‌ హిట్‌ గ్యారెంటీ.. స్త్రీ సాక్ష్యం
X

ప్రస్తుతం హర్రర్‌ కామెడీ సినిమాల ట్రెండ్‌ నడుస్తోంది. అన్ని భాషల నుంచి క్రమం తప్పకుండా వరుసగా హర్రర్‌ కామెడీ సినిమాలు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన పలు హర్రర్‌ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. కొన్ని మాత్రం నిరాశ పరిచాయి. బాలీవుడ్ లో విడుదలైన 'స్త్రీ 2' ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వంద కోట్లు వసూళ్లు అయితే గొప్ప విషయం అనుకుంటే స్త్రీ 2 ఏకంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. బాహుబలి 1 రికార్డ్‌ లతో పాటు పలు రికార్డులను స్త్రీ 2 సినిమా బ్రేక్ చేసి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది.

స్త్రీ 2 సినిమా ఘన విజయం సాధించిన నేపథ్యంలో త్వరలోనే రాబోతున్న ప్రభాస్‌, మారుతిల 'రాజా సాబ్‌' కూడా ఘన విజయం సాధిస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దర్శకుడు మారుతి రాజాసాబ్ సినిమాను హర్రర్‌ కామెడీ కాన్సెప్ట్‌ తో రూపొందిస్తున్నాడు. ఆయనకు సినిమాపై చాలా నమ్మకం ఉంది. తప్పకుండా ప్రభాస్‌ అభిమానులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. సోషల్‌ మీడియాలో రాజాసాబ్‌ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. పైగా ప్రభాస్ గత చిత్రాలు సలార్‌, కల్కి లు బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్ సినిమాలుగా నిలిచిన విషయం తెల్సిందే.

ప్రభాస్ ను ఇన్ని రోజులు వరుసగా యాక్షన్ సినిమాల్లోనే చూస్తున్న ప్రేక్షకులకు కాస్త మార్పు అన్నట్లుగా హర్రర్‌ సినిమాలో అదీ కామెడీ టచ్ ఉండే సబ్జెక్ట్‌ లో చూడబోతున్నందుకు చాలా ఆసక్తిగా ఉన్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న రాజాసాబ్‌ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 2025 ఏప్రిల్‌ 10న రాజాసాబ్‌ ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆకట్టుకునే మంచి కాన్సెప్ట్‌ తో సినిమా రూపొందుతోంది. ఈ ఏడాది చివరి వరకు షూటింగ్ పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి.

హర్రర్‌ కామెడీ సినిమాల ట్రెండ్ నడుస్తున్న ఈ సమయంలో రాజాసాబ్‌ గట్టి హిట్‌ కొట్టడం ఖాయం అంటూ స్త్రీ 2 వసూళ్లు ప్రత్యక్ష సాక్ష్యం గా నిలుస్తున్నాయి. ప్రభాస్‌ హర్రర్‌ సినిమాలో చేస్తే ఎలా ఉంటుందో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పైగా రాజా సాబ్ లో బాలీవుడ్‌ స్టార్‌ సంజయ్‌ దత్‌ కీలక పాత్రలో నటించడంతో పాటు హీరోయిన్స్ గా మాళవిక మోహన్‌ నటిస్తోంది. మరో ఇద్దరు హీరోయిన్స్ కూడా ఈ సినిమాలో ప్రభాస్‌ కి జోడీగా నటిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇటీవల విడుదలైన టీజర్ కి మంచి స్పందన వచ్చింది. సినిమా హైప్‌ క్రియేట్‌ చేసేలా ముందు ముందు హర్రర్‌ ఎలిమెంట్స్ తో టీజర్‌, ట్రైలర్‌ ఉండే అవకాశాలు ఉన్నాయి.