రాజా సాబ్ టీజర్ ఇకనైనా వదులుతారా..?
రెబల్ స్టార్ ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో వస్తున్న రాజా సాబ్ సినిమాను ఇంకా చెక్కుతూనే ఉన్నారు మేకర్స్.
By: Tupaki Desk | 6 March 2025 9:09 AM ISTరెబల్ స్టార్ ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో వస్తున్న రాజా సాబ్ సినిమాను ఇంకా చెక్కుతూనే ఉన్నారు మేకర్స్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుందని తెలుస్తుంది. ప్రభాస్ లాంటి స్టార్ హీరోతో థ్రిల్లర్ జోనర్ సినిమా చేయడం పెద్ద సాహసమే అని చెప్పొచ్చు. ఐతే ఈ కథలో ఉన్న కమర్షియల్ యాంగిల్స్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తాయని అంటున్నారు. అసలైతే రాజా సాబ్ ని ఈ ఇయర్ సమ్మర్ రిలీజ్ అనుకున్నారు కానీ ఇప్పుడు అది వాయిదా పడుతుందని తెలుస్తుంది.
ఆ సినిమా కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడన్నది ఇంకా చెప్పలేదు. ఐతే రాజా సాబ్ సినిమా నుంచి ఇప్పటివరకు టీజర్ వదల్లేదు. ప్రభాస్ గ్లింప్స్ ఇంకా మోషన్ పోస్టర్ ఒక్కటి మాత్రమే రిలీజ్ చేశారు. సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా కూడా మేకర్స్ మాత్రం వాళ్ల అభ్యర్ధనను పట్టించుకోవట్లేదు. కనీసం రాజా సాబ్ టీజర్ అయినా వదలండి అంటూ రెబల్ స్టార్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో కామెంట్స్ పెట్టినా చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు.
ఇంకా మారుతి ఎక్కడ కనిపించినా కూడా రాజా సాబ్ గురించి ఏదైనా కొత్త విషయం చెప్పండి అని అడిగితే అవన్నీ తర్వాత అని మాట దాటేస్తున్నాడు. ఈ సీక్రెసీ అంతా సినిమా మీద క్యూరియాసిటీ పెంచేస్తుంది నిజమే కానీ తీరా వచ్చాక అంచనాలను అందుకోకపోతే మాత్రం కచ్చితంగా ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవుతారన్న విషయాన్ని దర్శక నిర్మాతలు గుర్తించాలి. ఆడియన్స్ ని ఎంతసేపు హోల్డ్ చేస్తే సినిమాపి అంత అంచనాలు రెట్టింపు అవుతాయి.
ఈ విషయం తెలిసి కూడా రాజా సాబ్ యూనిట్ లేట్ చేస్తూ వచ్చింది. స్టార్ సినిమాలు అయినా కూడా ఈమధ్య ఎక్కువ ప్రమోషన్స్ చేస్తేనే ఎక్కువ మంది ఆడియన్స్ కు రీచ్ అవుతుంది. సినిమా ప్రమోషన్స్ లో రాజమౌళిని మించిన వారు లేరనేలా ఆయన సెట్ చేసుకున్నాడు. ఈమధ్య ఆయన తర్వాత ప్లేస్ లో అనీల్ రావిపూడి కూడా సినిమా ప్రమోషన్స్ లో సూపర్ అనిపించుకున్నాడు. మరి రాజా సాబ్ టీం ఏం చేస్తున్నారన్నది తెలియదు కానీ ఫ్యాన్స్ ని వెయిటింగ్ లో పెట్టి ఇబ్బంది పెట్టేస్తున్నారని చెప్పొచ్చు.