Begin typing your search above and press return to search.

ప్రభాస్ రీ రిలీజ్ కన్ఫర్మ్‌, రాజాసాబ్‌ నో ఛాన్స్‌!

మారుతి దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న రాజాసాబ్‌ సినిమా ఒక పక్కా కమర్షియల్ హర్రర్‌ కాన్సెప్ట్ మూవీగా తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   24 Sep 2024 7:27 AM GMT
ప్రభాస్ రీ రిలీజ్ కన్ఫర్మ్‌, రాజాసాబ్‌ నో ఛాన్స్‌!
X

ప్రభాస్‌ గడచిన పదేళ్లుగా వరుసగా భారీ చిత్రాలు చేస్తున్నాడు. బాహుబలి సినిమాతో పాన్‌ ఇండియా సూపర్‌ స్టార్‌ గా నిలిచిన ప్రభాస్‌ ఆ వెంటనే భారీ బడ్జెట్‌ చిత్రాలైన సాహో, రాధేశ్యామ్‌, ఆదిపురుష్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ మూడు సినిమాలు నిరాశ పరిచినా సలార్‌, కల్కి సినిమాలతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌ లను మరోసారి దక్కించుకుని ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకతను నిరూపించుకున్నాడు. ఈ సమయంలో ఆయన నటిస్తున్న మూవీ రాజా సాబ్‌. ప్రభాస్ ఈ మధ్య కాలంలో చేసిన సినిమాలతో పోల్చితే ఇది కాస్త తక్కువ బడ్జెట్‌ సినిమా అనే చర్చ జరుగుతోంది.

మారుతి దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న రాజాసాబ్‌ సినిమా ఒక పక్కా కమర్షియల్ హర్రర్‌ కాన్సెప్ట్ మూవీగా తెలుస్తోంది. ముగ్గురు ముద్దుగుమ్మలు హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ నటుడు సంజయ్‌ దత్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రభాస్ లుక్ ఇప్పటికే రివీల్‌ అవ్వడంతో ఫ్యాన్స్ అంతా సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ఎదురు చూస్తున్నారు. సినిమా చిత్రీకరణ ప్రారంభం అయిన సమయంలో పెద్దగా క్రేజ్‌ లేదు, కానీ ఇప్పుడు రాజా సాబ్‌ ఈజీగా రూ.500 కోట్ల వసూళ్లు సాధించడం ఖాయం అనే నమ్మకంను ప్రభాస్‌ ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు.

వచ్చే నెలలో ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా అక్టోబర్‌ 23న రాజా సాబ్‌ సినిమా టీజర్ రాబోతుందనే వార్తలు జోరుగా వచ్చాయి. కానీ మారుతి టీం కి సంబంధించిన వారు రాజా సాబ్ సినిమా టీజర్ రాబోతుంది అనే వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతానికి రాజాసాబ్‌ నుంచి ఎలాంటి అప్డేట్ రావడంలేదని తేల్చి చెప్పారు. అయితే సీతారామం దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా చేస్తున్న ఫౌజీ సినిమా నుంచి మాత్రం ఒక వీడియో దసరా సందర్భంగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ప్రభాస్ బర్త్‌ డే కి ఆయన హిట్‌ మూవీ రీ రిలీజ్ కి రెడీ అవుతోంది.

ఈ మధ్య కాలంలో చాలా మంది స్టార్‌ హీరోల హిట్‌ సినిమా లు రీ రిలీజ్ అవుతున్నాయి. ప్రభాస్ నటించిన సినిమాలు సైతం రీ రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు ప్రభాస్‌ హిట్ మూవీ మిస్టర్ పర్ఫెక్ట్‌ రీ రిలీజ్ కి సిద్ధం అవుతోంది. కాజల్ హీరోయిన్ గా నటించిన ఆ సినిమా ప్రభాస్ ను ఫ్యామిలీ ఆడియన్స్ కి చేరువ చేసింది. ఇప్పుడు ఆ సినిమా రీ రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ పుట్టిన రోజుకు రాజా సాబ్ టీజర్ రాకపోయినా మిస్టర్ పర్ఫెక్ట్‌ రీ రిలీజ్ కి సిద్ధం అవ్వడంతో ఫ్యాన్స్ కాస్త సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాజాసాబ్ నుంచి టీజర్ దీపావళి లేదా సంక్రాంతికి వస్తుందేమో చూడాలి.