రాజా సాబ్ ఏదొకటి తేల్చేయడం బెటర్!
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 6 Feb 2025 10:30 AM GMTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ది రాజా సాబ్. హార్రర్ కామెడీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాను ముందుగా ఏప్రిల్ 10న రిలీజ్ చేయాలని మేకర్స్ భావించి రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు. కానీ షూటింగ్ లేటవడం వల్ల సినిమా ఇప్పుడు చెప్పిన డేట్ కు రావడం కుదరనేది అందరికీ అర్థమైపోయింది. అయినా ఇప్పటివరకు రిలీజ్ డేట్ గురించి ఎలాంటి క్లారిటీ లేకుండా రాజా సాబ్ టీమ్ ఫ్యాన్స్ ను కంగారు పెడుతుంది.
వాయిదా తప్పదు కాబట్టి అదేదో చెప్పేసి కొత్త రిలీజ్ డేట్ ను త్వరగా అనౌన్స్ చేయమని ఫ్యాన్స్ నిర్మాణ సంస్థను కోరుతున్నారు. దీంతో నిర్మాతలు రాజా సాబ్ కోసం మంచి రిలీజ్ డేట్ ను వెతికే పనిలో పడినట్టు తెలుస్తోంది. పోటీ లేకుండా సోలో డేట్ అయితే బావుంటుందని భావిస్తున్నారు. పుష్ప2, కల్కి లాగా మంచి రిలీజ్ డేట్ కోసం వెతుకుతున్నారు.
ఏప్రిల్ 10కి సినిమా రెడీ అవడం లేదంటే సమ్మర్ కు కూడా వచ్చే అవకాశాలు తక్కువే. దీంతో రాజా సాబ్ మేకర్స్ దసరా వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. కానీ ఇప్పటికే దసరా కానుకగా సెప్టెంబర్ 25న అఖండ2, సంబరాల ఏటిగట్టు సినిమాలు షెడ్యూల్ అయిపోయాయి. దసరాకు సెప్టెంబర్ 25కి పెద్ద గ్యాప్ కూడా లేదు. కేవలం వారం రోజులే.
ఆ రెండు సినిమాల్లో ఏ సినిమాకు మంచి టాక్ వచ్చిన రాజా సాబ్ కు అనుకున్నన్ని థియేటర్లు దొరకవు. అంతేకాదు, అక్టోబర్ 2న కాంతార చాప్టర్1 రిలీజ్ కానుంది. వీటన్నింటినీ వద్దనుకుంటే ఇక నెక్ట్స్ దీపావళినే. కానీ ఆ సీజన్ ఎక్కువగా వర్కవుట్ అవదేమోనని ఆలోచిస్తున్నారట. పోనీ ఆగస్ట్ లో వద్దామంటే వార్2 వస్తుంది. వీటన్నింటినీ చూస్తుంటే రాజా సాబ్ రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ ఏదొక నిర్ణయాన్ని త్వరగా తీసుకుని అనౌన్స్ చేయడం వీలైనంత మంచిది.