Begin typing your search above and press return to search.

రాజా సాబ్.. మళ్లీ లేటేనా?

ఇది మారుతి కెరీర్ కు కూడా చాలా ముఖ్యమైన సినిమా. కాబట్టి ఆలస్యం అయినా మంచి అవుట్ పుట్ ఇవ్వలని చూస్తున్నాడు.

By:  Tupaki Desk   |   17 Feb 2025 9:30 PM GMT
రాజా సాబ్.. మళ్లీ లేటేనా?
X

ప్రభాస్ నటిస్తున్న హారర్ కామెడీ :ది రాజా సాబ్' సినిమా గురించి ఊహించని లీక్స్ వెలుగులోకి వస్తున్నాయి. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా మొదట ఏప్రిల్ 10న విడుదల కావాల్సి ఉండగా, ఆ తర్వాత మేకర్స్ కొత్త తేదీ కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది. ఇక లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం, సినిమా మరోసారి వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

షూటింగ్ దాదాపు పూర్తయిందని మేకర్స్ ప్రకటించినప్పటికీ, సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా ఫినిష్ కాలేదట. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ పనిలో జాప్యం జరుగుతుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. హారర్ జానర్ కావడం, గ్రాఫిక్స్ కీలక పాత్ర పోషించే సినిమా కావడంతో, విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా మేకర్స్ అత్యున్నత ప్రమాణాలు పాటించాలని చూస్తున్నారు.

సాధారణంగా మారుతి తన సినిమాలను జెట్ స్పీడ్ లోనే అనుకున్న ప్లాన్ ప్రకారం ఫినిష్ చేస్తాడు. కానీ ఈసారి ప్రభాస్ సినిమా కావడంతో అతను కూడా సుకుమార్, రాజమౌళి తరహాలోనే ఆలోచించాల్సి వస్తోంది. ఇది మారుతి కెరీర్ కు కూడా చాలా ముఖ్యమైన సినిమా. కాబట్టి ఆలస్యం అయినా మంచి అవుట్ పుట్ ఇవ్వలని చూస్తున్నాడు.

ఈ నేపథ్యంలోనే, ముందుగా అనుకున్న ఏప్రిల్ 10 విడుదల డేట్ ను మార్చాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. మేకర్స్ ఈ సినిమా రిలీజ్‌ను జూలై 18కి మార్చే యోచనలో ఉన్నారని కొన్ని వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ తేదీ కూడా ఖరారు కాలేదు. ప్రస్తుతం గ్రాఫిక్స్ టీమ్ పనిని వేగంగా పూర్తిచేయాలని ప్రయత్నిస్తున్నప్పటికీ, దాని మరింత టైమ్ పట్టే అవకాశం ఉందట.

ప్రభాస్ సినిమాలన్నీ భారీ స్థాయిలో విడుదలయ్యే నేపథ్యంలో, అభిమానుల్లో అంచనాలు విపరీతంగా పెరుగుతాయి. అయితే, గతంలో సలార్, కల్కి కూడా అనుకున్న సమయానికి రిలీజ్ కాకపోవడంతో అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్ విషయంలోనూ అదే పరిస్థితి తలెత్తుతుందా? అన్న సందేహం నెలకొంది.

ప్రస్తుతం సినిమా షూటింగ్ దాదాపుగా ముగిసినా, ప్రభాస్ పలు కీలక సన్నివేశాల కోసం మరో రెండు వారాల షూటింగ్ చేయాల్సి ఉందని టాక్. అంతేకాదు, సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ పూర్తి స్థాయిలో తగిన ప్రమాణాలను అందుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మేకర్స్ హడావుడిగా రిలీజ్ చేయకుండా, మరింత క్వాలిటీ పెంచేందుకు ఎక్కువ సమయం తీసుకుంటున్నారని సమాచారం. ఇక రిలీజ్ డేట్ పై మేకర్స్ ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.