Begin typing your search above and press return to search.

ఎన్ని సార్లు మోసం చేస్తావ్ డార్లింగ్!

ప్రభాస్ నుంచి వచ్చిన చివరి ఎనిమిది సినిమాలలో ఏది కూడా ముందుగా చెప్పిన డేట్ కి రాలేదు. ఒకటి డేట్ కు వస్తానని చెప్పి ఆడియెన్స్ ని అనుకోకుండా మోసం చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

By:  Tupaki Desk   |   18 Dec 2024 10:00 AM GMT
ఎన్ని సార్లు మోసం చేస్తావ్ డార్లింగ్!
X

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం దేశంలోనే అత్యధిక మార్కెట్ ఉన్న స్టార్ గా ఉన్నాడు. అతని సినిమాల కోసం ప్రేక్షకులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా మార్కెట్ పెంచుకున్న నటుడిగా ప్రభాస్ ఉన్నాడు. అలాగే దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న స్టార్స్ లో ఒకడిగా ప్రభాస్ ఉన్నాడు. ఆయనతో సినిమా చేయాలంటే 300 కోట్లకి పైగా బడ్జెట్ ని నిర్మాతలు సిద్ధం చేసుకోవాల్సిందే.

అయితే ఎంత బడ్జెట్ పెట్టిన తిరిగి రికవరీ ఉంటుందనే నమ్మకంతో మేకర్స్ ధైర్యం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ లైన్ అప్ లో అరడజను సినిమాల వరకు ఉన్నాయి. ఐదు సినిమాలు అయితే ఆల్ కన్ఫర్మ్ అయిపోయి ఉండగా మరొకటి చర్చల దశలో ఉంది. అలాగే మరో ఇద్దరు, ముగ్గురు దర్శకులు ప్రభాస్ తో సినిమాలు చేయడం కోసం లైన్ లో ఉన్నారు. ఇదిలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో 'ది రాజాసాబ్' మూవీ చేస్తున్నాడు.

ఈ మూవీ షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. నిజానికి డిసెంబర్ ఆఖరుకి ఈ సినిమా షూటింగ్ అయిపోతుందనే ప్రచారం ఉంది. అయితే అది ఎంత వరకు సాధ్యం అవుతుందనేది క్లారిటీ లేదు. తాజాగాగా మూవీ షూటింగ్ లో ప్రభాస్ కి గాయం అయ్యింది. ఇది కూడా షూటింగ్ లకి ఆటంకం కలిగించేదే. 'ది రాజాసాబ్' చిత్రాన్ని 2025 ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అయితే ఆ డేట్ కి సినిమా కచ్చితంగా వస్తుందా అంటే డౌటే అనే మాట వినిపిస్తోంది.

ప్రభాస్ నుంచి వచ్చిన చివరి ఎనిమిది సినిమాలలో ఏది కూడా ముందుగా చెప్పిన డేట్ కి రాలేదు. ఒకటి డేట్ కు వస్తానని చెప్పి ఆడియెన్స్ ని అనుకోకుండా మోసం చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ డార్లింగ్ లేటుగా వచ్చినా కూడా ఫ్యాన్స్ లో ప్రేమ మాత్రం తగ్గలేదు. అప్పట్లో మిస్టర్ పర్ఫెక్ట్ రీ షూట్ వలన వాయిదా వేయడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది.

'మిర్చి' మూవీ చెప్పిన రిలీజ్ కంటే ఆలస్యంగానే ప్రేక్షకుల ముందుకొచ్చింది. అలాగే 'బాహుబలి' సిరీస్ లు కూడా వాయిదా పడ్డవే. ఇక 'సాహో', 'ఆదిపురుష్', 'సలార్', 'కల్కి2898ఏడీ' సినిమాలు కూడా ముందు ఎనౌన్స్ చేసిన డేట్ కు అసలే రాలేదు. రెండు మూడు సార్లు వాయిదా పడ్డవే. ఇదే సెంటిమెంట్ 'ది రాజాసాబ్' విషయంలో కూడా రిపీట్ అవుతుందనే ప్రచారం నడుస్తోంది.

అయితే ఏప్రిల్ 10కి ఎట్టి పరిస్థితిలో సినిమాని రిలీజ్ చేయాలనే లక్ష్యంతో డైరెక్టర్ మారుతి ఉన్నారు. ఒక వేళ సీజీ వర్క్ ఆలస్యం అయితే మాత్రం వాయిదా వేయక తప్పకపోవచ్చని అనుకుంటున్నారు. అదే డేట్ కి రాకింగ్ స్టార్ యష్ 'టాక్సిక్' మూవీ రిలీజ్ కూడా ఉంది. అయితే ఈ రెండింట్లో ఏదో ఒకటే ఆ డేట్ కి ప్రేక్షకుల ముందుకి వచ్చే ఛాన్స్ ఉందనే ప్రచారం ఇండస్ట్రీలో జరుగుతోంది.