Begin typing your search above and press return to search.

ప్రభాస్ సినిమా.. హ్యారీపోటర్ రేంజ్ లో?

హాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ కి అత్యంత ప్రతిష్టాత్మక ఫ్రాంచైజ్ లలో ఇది ఒకటి. కంప్లీట్ ఫిక్షనల్ ప్రపంచంలో ఈ కథ నడుస్తూ ఉంటుంది.

By:  Tupaki Desk   |   13 Nov 2024 7:15 AM GMT
ప్రభాస్ సినిమా.. హ్యారీపోటర్ రేంజ్ లో?
X

హాలీవుడ్ లో 'హ్యారీపోటర్' సిరీస్ అంటే ఇష్టపడని వారు ఉండరు. చిన్న పిల్లలకి ఇది బాగా ఇష్టమైన మూవీ ఫ్రాంచైజ్ అని చెప్పాలి. హాలీవుడ్ ఫోక్ టేల్స్ కథల ఆధారంగా ఈ 'హ్యారీపోటర్' సిరీస్ ని తెరకెక్కించారు. ఈ సిరీస్ లో ఇప్పటి వరకు 8 సినిమాలు వచ్చాయి. హాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ కి అత్యంత ప్రతిష్టాత్మక ఫ్రాంచైజ్ లలో ఇది ఒకటి. కంప్లీట్ ఫిక్షనల్ ప్రపంచంలో ఈ కథ నడుస్తూ ఉంటుంది.

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇప్పటి వరకు ఈ తరహా కథని ఎవరూ ప్రయత్నం చేయలేదు. వందల కోట్ల బడ్జెట్ తో ఇలాంటి కథలని తెరకెక్కించాల్సి ఉంటుంది. అందుకే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ తరహా కథలు చెప్పే సాహసం చేయరు. అయితే ఇప్పుడు ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ పెరిగాయి. వందల కోట్ల బడ్జెట్ తో సినిమాలు చేస్తున్నారు. ముఖ్యంగా డార్లింగ్ ప్రభాస్ మీద ఎంత బడ్జెట్ అయిన పెట్టడానికి నిర్మాతలు ముందుకొస్తున్నారు.

ప్రస్తుతం ప్రభాస్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో 'ది రాజాసాబ్' సినిమాని మారుతి దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. హర్రర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా కథాంశం ఉండబోతోంది. ఇప్పటికే నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మూవీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎవ్వరి అంచనాలకి అందని విధంగా ఉంటుందని అన్నారు. ఇదిలా ఉంటే ప్రభాస్ తో 'స్పిరిట్' సినిమాని నిర్మిస్తున్న టి-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ ది రాజాసాబ్ సినిమాని హ్యారీపోటర్ తో పోల్చారు.

ఇందులో కొన్ని సన్నివేశాలు చూశానని, అవి 'హ్యారీపోటర్' తరహాలో ఉన్నాయని అన్నారు. కచ్చితంగా మూవీ ఆడియన్స్ ని కొత్త అనుభూతి అందించే అవకాశం ఉందని అన్నారు. అలాగే ప్రభాస్ తో 'స్పిరిట్' కాకుండా మరో సినిమా కూడా చేయబోతున్నట్లు భూషణ్ కుమార్ తెలిపారు. మైత్రీ మూవీ మేకర్స్ తో కలిసి ఆ సినిమా నిర్మించనున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ప్రభాస్ తో మరల కలిసి పని చేయడం హ్యాపీగా ఉందని భూషణ్ కుమార్ అన్నారు.

ఇదిలా ఉంటే 'ది రాజాసాబ్' మూవీ 2025 ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేస్తున్నాడనే ప్రచారం వచ్చినపుడు కొంతమంది కరెక్ట్ కాంబినేషన్ కాదని విమర్శలు చేశారు. అయితే 'ది రాజసాబ్' పోస్టర్స్, కంటెంట్ తో సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెంచేస్తున్నారు. 'హ్యారీపోటర్' తరహాలో ఈ సినిమాలో ఎలిమెంట్స్ ఉంటాయని భూషణ్ కుమార్ చెప్పిన మాటలు కూడా సినిమాకి బూస్టింగ్ అవుతాయని అనుకుంటున్నారు.