ప్రభాస్ రాజాసాబ్ ఐదు నెలలు..!
మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న 'రాజాసాబ్' సినిమాలో ప్రభాస్‌కి జోడీగా మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
By: Tupaki Desk | 19 March 2025 7:42 PM ISTప్రభాస్ 'రాజాసాబ్' ఏప్రిల్ 10, 2025న విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడనున్నట్లు కన్ఫర్మ్ అయింది. ఇప్పటి వరకు షూటింగ్ పూర్తి చేయలేదని తెలుస్తోంది. సినిమా షూటింగ్ ప్రారంభం అయి దాదాపు మూడు ఏళ్లు అవుతున్నా కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. కల్కి 2898 ఏడీ సినిమా విడుదదలైన తర్వాతే రాజాసాబ్ సినిమాకు ప్రనభాస్ ఎక్కువ డేట్లు ఇచ్చినట్లు నిర్మాత చెప్పుకొచ్చారు. ఈ సమ్మర్‌లో ప్రభాస్ సినిమా వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కి నిరాశే మిగిలింది. ఈ ఏడాదిలో 'రాజాసాబ్' సినిమాతో పాటు 'ఫౌజీ' సినిమా సైతం వస్తుందనే ప్రచారం జరిగింది. కానీ రాజాసాబ్ సినిమా ఆలస్యం కావడంతో 'ఫౌజీ' సినిమా ఈ ఏడాదిలో వచ్చే అవకాశం లేదు.
మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న 'రాజాసాబ్' సినిమాలో ప్రభాస్‌కి జోడీగా మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. హర్రర్ కామెడీ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకి త్వరలో కొత్త విడుదల తేదీని కన్ఫర్మ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ముందుగా అనుకున్న విడుదల తేదీకి ఐదు నెలల ఆలస్యంగా రాజా సాబ్ సినిమాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను సెప్టెంబర్ నెలలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. దసరా సీజన్ కంటే ముందుగానే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా మారుతి ప్లాన్ చేస్తున్నాడట.
ప్రభాస్ గత చిత్రాలు సలార్, కల్కి 2898 ఏడీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. దాంతో రాజాసాబ్ సినిమాతో ప్రభాస్ హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అనే నమ్మకంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదట్లో మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా ఏంటో అని విమర్శించిన వారు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్‌లో చాలా మంది మారుతి దర్శకత్వంలో సినిమాపై ట్రోల్ చేశారు. కానీ సినిమా నుంచి వస్తున్న ఒక్కో అప్‌డేట్ అంచనాలు పెంచుతూ వచ్చింది. ముఖ్యంగా ప్రభాస్ లుక్ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. ప్రభాస్ పాత్ర గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది.
గత పదేళ్ల కాలంలో ప్రభాస్‌ను చూడని విధంగా ఈ సినిమాలో మారుతి చూపించబోతున్నాడు అనే టాక్ వినిపిస్తోంది. రాజాసాబ్ సినిమా ఈ సమ్మర్‌లో విడుదల అయి ఉంటే కచ్చితంగా సీతారామం చిత్ర దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఫౌజీ' సినిమాను సైతం ఇదే ఏడాదిలో విడుదల చేసి ఉండేది. కానీ రాజాసాబ్ సినిమా సెప్టెంబర్‌కి వాయిదా పడటంతో ఫౌజీ సినిమా విడుదల ఈ ఏడాదిలో ఉండే అవకాశాలు తక్కువ అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రభాస్, హను రాఘవపూడి కాంబో మూవీపైనా అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఆర్మీ నేపథ్యంలో ఫౌజీ సినిమా భారీ ఎత్తున రూపొందుతోంది.
ఫౌజీ సినిమాలో ప్రభాస్‌కి జోడీగా సోషల్ మీడియా స్టార్ ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ రెండు సినిమాలతో పాటు సందీప్ వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమా సైతం రాబోతున్న విషయం తెల్సిందే. ఆ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి ప్రభాస్ లైనప్ భారీగానే ఉంది. కానీ ఆ సినిమాల విడుదల ఎప్పుడు అనేది గందరగోళంగా ఉంది.