Begin typing your search above and press return to search.

రిషబ్ శెట్టి - ప్రభాస్ కాంబో.. ఇది అసలు మ్యాటర్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస ప్రాజెక్టులతో ప్రస్తుతం బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   11 Dec 2024 11:10 AM GMT
రిషబ్ శెట్టి - ప్రభాస్ కాంబో.. ఇది అసలు మ్యాటర్!
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస ప్రాజెక్టులతో ప్రస్తుతం బిజీగా ఉన్న విషయం తెలిసిందే. "సలార్ 2," "కల్కి 2.," "స్పిరిట్," "ఫౌజీ" వంటి భారీ చిత్రాలతో పాటు మరిన్ని ఆసక్తికరమైన కథలు అతని లైనప్‌లో ఉన్నాయి. అలాగే ఇటీవల, హోంబాలే ఫిలిమ్స్ నిర్మాణంలో ప్రభాస్ హీరోగా రిషబ్ శెట్టి కథ అందించినట్లు వార్తలు వచ్చాయి. "కాంతార" చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రిషబ్ శెట్టి, ప్రభాస్ కోసం ఒక పవర్ఫుల్ కథను రాశారని టాక్ వచ్చింది..

హోంబాలే ఫిలిమ్స్ ఇప్పటికే "సలార్" చిత్రంతో ప్రభాస్‌తో కలిసి పనిచేస్తోంది. మొదటి పార్ట్ సక్సెస్ కావడంతో కొనసాగింపుగా "సలార్ 2" కూడా రూపొందనుంది. ఈ కాంబినేషన్ పట్ల ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే హోంబాలే సంస్థలో ప్రభాస్ మరో మూడు ప్రాజెక్టులను చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక అందులో భాగంగా రిషబ్ శెట్టి, ప్రభాస్ కోసం కథను వినిపించినట్లు టాక్ వచ్చింది.

ఇక రిషబ్ శెట్టి ప్రభాస్ కోసం కథ అందించారన్న వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. హోంబాలే ఫిలిమ్స్ నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం ఇంకా కథను ఫైనలైజ్ చేయలేదన్నది తాజా సమాచారం. హోంబాలే ఫిలిమ్స్ వంటి ప్రెస్టీజియస్ బ్యానర్ ప్రభాస్‌తో కలిసి మూడు బిగ్గెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్టులను రూపొందించేందుకు ఆసక్తి చూపిస్తోందనేది స్పష్టమవుతోంది. అందులో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనే మరొకటి రానుండగా లోకేష్ కనగరాజ్ తో కూడా ఒకటి చేసే అవకాశం ఉందట.

హోంబాలే ఫిలిమ్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ ప్రాజెక్ట్‌పై క్లారిటీ రావడం కష్టమే. ఇప్పటికే "సలార్ 2 " "కల్కి 2," "స్పిరిట్" వంటి భారీ ప్రాజెక్టులతో ప్రభాస్ రెడి అవుతున్నారు. ఈ నేపథ్యంలో, రిషబ్ శెట్టి కథతో ఆయన ఓ కొత్త ప్రాజెక్ట్ చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక మరోవైపు రిషబ్ కాంతార 2 సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రీక్వెల్ గా రానున్న ఆ సినిమా హై విజువల్స్ తో భారీ బడ్జెట్ పాన్ ఇండియాగా రానుంది.

ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న రెండవ కాంతార హై విజువల్ ఎఫెక్ట్స్ తో పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్లే రిలీజ్ కానుంది. తప్పకుండా సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. ఇక మరోవైపు ప్రభాస్ రాజాసాబ్ హారర్ మిస్టరీ నేపథ్యంలో రానుంది. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల చేయనున్నారు.