Begin typing your search above and press return to search.

అప్పుడు ఎన్టీఆర్‌తో, ఇప్పుడు ప్రభాస్‌ తో సూపర్‌స్టార్‌..!

ప్రభాస్‌, ప్రశాంత్ నీల్‌ కాంబోలో వచ్చిన 'సలార్‌' బ్లాక్ బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకుంది.

By:  Tupaki Desk   |   9 Sep 2024 10:30 AM GMT
అప్పుడు ఎన్టీఆర్‌తో, ఇప్పుడు ప్రభాస్‌ తో సూపర్‌స్టార్‌..!
X

ప్రభాస్‌, ప్రశాంత్ నీల్‌ కాంబోలో వచ్చిన 'సలార్‌' బ్లాక్ బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకుంది. రికార్డ్‌ స్థాయి వసూళ్లు నమోదు చేసిన సలార్‌ కి ప్రస్తుతం సీక్వెల్‌ పనులు జరుగుతున్నాయి. సలార్‌ పార్ట్ 1 లో ఎన్నో విషయాలను సస్పెన్స్ గా ఉంచడంతో పార్ట్‌ 2 పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఎప్పుడెప్పుడు ఆ ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సలార్‌ 2 కి సంబంధించిన వర్క్ మొదలైంది. పార్ట్‌ 1 లో కనిపించిన దాదాపు అందరూ నటీనటులు పార్ట్‌ 2 లో కనిపించబోతున్నారు.

పార్ట్‌ 2 లో కొందరు స్టార్స్ అదనంగా కనిపించే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్ లాల్‌ ను సలార్‌ 2 లో నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఇటీవలే దర్శకుడు ప్రశాంత్ నీల్‌ స్వయంగా వెళ్లి మోహన్ లాల్‌ ను కలిశాడనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గతంలోనే తెలుగు లో జనతా గ్యారేజ్ చిత్రంలో మోహన్‌ లాల్‌ నటించాడు. ఎన్టీఆర్‌ తో కలిసి నటించిన మోహన్‌ లాల్‌ ఇటీవలే మంచు విష్ణు ప్రతిష్టాత్మక మూవీ కన్నప్ప లో నటించేందుకు ఓకే చెప్పాడు. ఇప్పుడు సలార్‌ 2 లో నటించేందుకు ఆయన గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

సలార్ 2 లో ఇప్పటికే ప్రభాస్‌, పృథ్వీరాజ్ సుకుమారన్‌ తో పాటు జగపతిబాబు, శృతి హాసన్‌, బాబీ సింహా, శ్రియా రెడ్డి ఇంకా ప్రముఖులు నటిస్తున్నారు. పార్ట్‌ 2 లో శౌర్యాంగ పర్వం కథను చూపించబోతున్నారు. ఇప్పటి వరకు సలార్‌ 2 సినిమా షూటింగ్ గురించి మేకర్స్ నుంచి ఎలాంటి అప్‌డేట్‌ రాలేదు. కానీ ఇటీవల చిత్ర నిర్మాత విజయ్ కిరగందూర్ మాట్లాడుతూ 2025 లో సలార్‌ 2 ను రిలీజ్ చేస్తామంటూ ప్రకటించాడు. హాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ మూవీ గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్ స్థాయిలో సలార్‌ 2 ఉంటుందని ఆయన చాలా నమ్మకంగా చెబుతున్నాడు.

ప్రభాస్‌ కి సలార్‌ బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్‌ ను అందించింది. సలార్‌ 2 అంతకు మించి అన్నట్లుగా ఉండే అవకాశం ఉంది. సలార్‌ 2 దాదాపుగా రూ.1500 కోట్ల వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని అప్పుడే ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. కల్కి 2898 ఏడీ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో సలార్‌ 2 పై అంతకు మించి అన్నట్లుగా అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజాసాబ్‌ సినిమాను చేస్తున్న ప్రభాస్‌ ఆ తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమాను చేయనున్నాడు. సందీప్‌ వంగ దర్శకత్వంలో స్పీరిట్ మూవీ చేయబోతున్న విషయం తెల్సిందే.