ప్రభాస్.. క్రేజ్ కనిపిస్తోంది, కానీ రికార్డులు బ్రేక్ అవ్వట్లే..
ఈసారి సలార్ రీ రిలీజ్ కు ముందు నుంచే అంచనాలు ఉన్నాయని ఫ్యాన్స్ హడావుడిగానే కనిపించారు.
By: Tupaki Desk | 22 March 2025 11:45 AM ISTప్రభాస్ క్రేజ్ ఈ పదేళ్లలో ఉహించని స్థాయిలో పెరిగిపోయింది. చిన్న అప్డేట్ వచ్చినా కూడా అభిమానుల హంగామా స్టార్ట్ అవుతుంది. అది కొత్త సినిమా అయినా, రీ రిలీజ్ అయినా పెద్దగా తేడా ఉండదు. 'సలార్' రీ రిలీజ్ లోనూ అదే జరగింది. థియేటర్ల ఎదుట బారులు తీరారు, ఖాన్సార్ సీల్ వేసుకోవడమే కాకుండా ఫ్యాన్ షోలకు స్టేజీ రెడీ చేశారు. కానీ ఈ హడావుడి అంతా నెట్టింట్లో మాత్రమే. రియల్‌గా రికార్డుల విషయంలో మాత్రం ప్రభాస్ క్రేజ్ ఇంకా అనుకున్నంత రేంజ్ లో క్లిక్ కాలేదని అనిపిస్తోంది.
ఈసారి సలార్ రీ రిలీజ్ కు ముందు నుంచే అంచనాలు ఉన్నాయని ఫ్యాన్స్ హడావుడిగానే కనిపించారు. స్టార్డమ్, యాక్షన్ మేనియా, ప్రషాంత్ నీల్ మేకింగ్‌తో మళ్లీ మళ్లీ చూడదగిన సినిమా అంటూ భారీగా బుకింగ్స్ వస్తాయని ఆశించారు. కానీ అందరికీ ఆశ్చర్యం కలిగిస్తూ ఓపెనింగ్స్ లో 1.02 లక్షల టికెట్లే బుక్ అయ్యాయి. ఇది చాలా మంచి ఫిగర్ అయినప్పటికీ, గత రీ రిలీజ్‌ల రికార్డులతో పోలిస్తే వెనకే ఉందన్నది సత్యం.
కానీ ఒక మంచి విషయం ఏమిటంటే, తమిళ స్టార్ విజయ్ చిత్రం 'ఘిల్లి'ని మాత్రం సలార్ అధిగమించింది. 88 వేల టికెట్ల ప్రీ సేల్‌తో ఉన్న ఘిల్లిని 1.02 లక్షలతో దాటేయడం ప్రభాస్ అభిమానులకు కొంత ఊరట. అయినప్పటికీ, ప్రభాస్ స్థాయికి సరిపోయేలా ఏ రీ రిలీజ్ సినిమా కూడా ఇప్పటి వరకూ గట్టి స్టేట్‌మెంట్ ఇవ్వలేదన్నదే ఇండస్ట్రీలో చర్చ.
బుక్ మై షో డేటా ప్రకారం, సలార్ రీ రిలీజ్ బుకింగ్స్ తెలుగు సినిమాల రీ రిలీజ్‌లలో నాలుగో స్థానంలో నిలిచింది. గబ్బర్ సింగ్, మురారి, బిజినెస్ మేన్ లాంటి సినిమాలు ప్రభాస్ క్రేజ్‌ను మించిన ఫలితాలు సాధించాయి. అంతే కాదు.. టాప్ 5 ఇండియన్ రీ రిలీజ్‌లలో కూడా సలార్ చోటు దక్కించుకోలేకపోయింది. క్రిస్టోఫర్ నోలన్ ఇంటర్‌స్టెలార్, సనం తేరీ కసం వంటి సినిమాలు పైకి నిలవడం గమనార్హం.
టాప్ తెలుగు రీ రిలీజ్‌ల బుక్ మై షో ప్రీ సేల్స్ రికార్డులు:
1. గబ్బర్ సింగ్ – 1.75 లక్షలు
2. మురారి – 1.45 లక్షలు
3. బిజినెస్ మేన్ – 1.45 లక్షలు
4. సలార్ – 1.02 లక్షలు