'సలార్' రీ రిలీజ్... అప్పుడే ఎందుకంటే!
ఫ్యాన్స్ మాత్రం సలార్ పార్ట్ 1 ను మరోసారి థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడం కోసం వెయిట్ చేస్తున్నామని అంటున్నారు.
By: Tupaki Desk | 25 Feb 2025 5:19 AM GMTరెబల్ స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన 'సలార్' సినిమా దాదాపుగా వెయ్యి కోట్ల వసూళ్లు రాబట్టింది. భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు, ప్రభాస్ మాస్ లుక్‌కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న సలార్ సినిమా రీ రిలీజ్‌కి సిద్ధం అవుతోంది. సలార్ 2 కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ ముందుకు మరోసారి సలార్ 1 రానుంది. ఈ మధ్య కాలంలో రీ రిలీజ్‌లు కామన్ అయ్యాయి. కానీ విడుదలైన తర్వాత మరీ ఇంత త్వరగా థియేటర్‌లో రీ రిలీజ్ కావడం విడ్డూరంగా ఉంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాన్స్ మాత్రం సలార్ పార్ట్ 1 ను మరోసారి థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడం కోసం వెయిట్ చేస్తున్నామని అంటున్నారు.
సలార్ పార్ట్ 1 కి ఉన్న క్రేజ్ నేపథ్యంలో రీ రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ గత చిత్రం కల్కి సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు సలార్ పార్ట్ 2 గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ 'సలార్' సినిమాను రీ రిలీజ్ చేస్తే కచ్చితంగా మంచి స్పందన దక్కడం ఖాయం అని, తద్వారా లాభం పొందవచ్చు అని నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈమధ్య కాలంలో ఇంత తక్కువ సమయంలో రీ రిలీజ్ కాబోతున్న సినిమా సలార్ పార్ట్ 1 గా టాక్ వినిపిస్తుంది. ప్రశాంత్ నీల్ ఈ సినిమాను కేజీఎఫ్ ను మించి భారీ యాక్షన్ సన్నివేశాలతో చిత్రీకరించారు. బాక్సాఫీస్ వద్ద మరోసారి ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోబోతుంది.
ప్రభాస్, ప్రశాంత్ నీల్ 'సలార్ పార్ట్ 1' సినిమాను మార్చి 21న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మార్చి నెలలో మహేష్ బాబు, వెంకటేష్ నటించిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', కార్తీ హీరోగా నటించిన 'యుగానికి ఒక్కడు', నాని, విజయ్ దేవరకొండ నటించిన 'ఎవడే సుబ్రమణ్యం' సినిమాలతో పాటు తాజాగా సలార్ 2 సినిమా రీ రిలీజ్ జాబితాలో చేరింది. ఒకే నెలలో ఇన్ని సినిమాల రీ రిలీజ్ ఉండటం చాలా అరుదుగా జరుగుతుంది. సమ్మర్ సీజన్ ప్రారంభంకు ముందు ఇలా బ్యాక్ టు బ్యాక్ పెద్ద, చిన్న సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కి రెడీ కావడంతో ఆయా హీరోల అభిమానులు థియేట్రికల్ ఎంజాయ్‌కి రెడీ అవుతున్నారు.
ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే మారుతి దర్శకత్వంలో 'రాజాసాబ్' సినిమాను చేస్తున్నాడు. ఈ సమ్మర్ కానుకగా ఆ సినిమా బాక్సాఫీస్ వద్దకు రాబోతుంది. మరో వైపు హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమాను ప్రభాస్ చేస్తున్నాడు. ఫౌజీ అనే టైటిల్‌ను ఆ సినిమాకు పరిశీలిస్తున్నారు. సందీప్ వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమా ఇదే ఏడాదిలో ప్రారంభం కాబోతుంది. వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవి కాకుండా సలార్ 2, కల్కి 2898 ఏడీ పార్ట్ 2 సినిమాలు సైతం సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. ఇన్ని సినిమాలతో ప్రభాస్ రాబోతున్న నేపథ్యంలో ఫ్యాన్స్‌కి పండగే పండగ. ఈ సమయంలో సలార్ 1 రీ రిలీజ్ కావడం మరింత పెద్ద పండుగ గా చెప్పుకోవచ్చు.