డైరెక్టర్ల ఎంపికలో ప్రభాస్ పానీ పూరి లాంటి వాడే!
సినిమాల ఎంపికలోనూ అతడు దర్శకుల బ్యాక్ గ్రౌండ్ లాంటివి పెద్దగా చెక్ చేయకుం డానే స్టోరీ నచ్చితే లాక్ చేసేస్తాడని తెలుస్తోంది.
By: Tupaki Desk | 2 Nov 2024 10:30 PM GMTప్రభాస్ రేంజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. నేను పాన్ ఇండియా మార్కెట్ నే శాషించే హీరో. ఒక్కో సినిమాతో సునాయాసంగా 1000 కోట్లకు పైగా వసూళ్లు తేగల సత్తా ఉన్న నటుడు. ఆ రేంజ్ హీరో ప్రభాస్. ఈ స్థాయిలో ఉన్న హీరో బేసిక్ గా దర్శకుల విషయంలో ఆచితూచి వ్యవరహిస్తుంటారు. అతడి ప్రీవీయస్ ట్రాక్ రికార్డు...సక్సెస్ లు ఫెయిల్యూ ర్లు మొత్తం గ్రాఫ్ అంతా పరిశీలించి డైరెక్టర్ ని ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది.
కానీ డార్లింగ్ ఆ టైపు కాదు. 1800 కోట్ల బాహుబలి తర్వాత ప్రభాస్ సుజిత్ అనే కొత్త కుర్రాడితో సాహో చేసాడు. రాధాకృష్ణ తో 'రాదేశ్యామ్' చేసాడు. బాలీవుడ్ లో ఓం రౌత్ తో ఆదిపురుష్ చేసాడు. ఈ మూడు సినిమాలు కూడా ప్రభాస్ కి ప్లాప్ ల్లోకే లాగాయి. ఆదర్శకుల ట్రాక్ రికార్డు చూస్తే ఏమంత గొప్పగానూ లేదు. సుజిత్... రాధాకృష్ణలు కొత్తగా వచ్చిన మేకర్లు. దర్శకులు పెద్దగా అనుభవం లేదు. ఓంరౌత్ కూడా మూడు నాలుగు సినిమాలే చేసాడు.
అంతకు ముందు చేసిన తన్హాజీ కూడా బ్లాక్ బస్టర్ అయిన చిత్రం కూడా కాదు. కానీ డార్లింగ్ అవకాశం ఇచ్చాడు. కానీ అతడి నమ్మకాన్ని నిలబెట్టలేకపోయారు. అటుపై కేజీఎఫ్ తో హిట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్ తో సలార్, మహానటితో సత్తా చాటిన నాగ్ అశ్విన్ తో కల్కి 2898 చేసి ఒకేసారి రెండు బ్లాక్ బస్టర్లు నమోదు చేసారు. ఇదే సమయంలో మారుతి తో రాజాసాబ్ సినిమా కూడా కమిట్ అయ్యాడు. అలాగే హను రాఘవపూడితో పౌజీ చేస్తున్నాడు.
మరో యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తో కూడా ఓ సినిమా లాక్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. మరోవైపు యానిమల్ తో సంచలనమైన సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ చేస్తున్నాడు. మొత్తంగా ప్రభాస్ ఎంపిక చేసుకున్న దర్శకుల జాబితా పరిశీలిస్తే హిట్లు..ప్లాపులు ఉన్నా? తాను కథని నమ్మి ధైర్యంగా ముందుకు వెళ్తున్నాడన్నది అర్దమవుతుంది. ఇక్కడో పోలిక చేయోచ్చు. ప్రభాస్ కి పానీపూరీ అంటే ఇష్టం. అందులో కంటెంట్ ఉందా? లేదా? అన్నది చూస్తాడు.
అవి రోడ్డు మీద చిన్న బండి మీద ఉన్నాయా? స్టార్ హోటల్ లో ఉన్నాయా? అన్నది చూడడు. నచ్చితే ఎక్కడైనా లాగించేయాలి అన్నటైపు. సినిమాల ఎంపికలోనూ అతడు దర్శకుల బ్యాక్ గ్రౌండ్ లాంటివి పెద్దగా చెక్ చేయకుం డానే స్టోరీ నచ్చితే లాక్ చేసేస్తాడని తెలుస్తోంది.