బాక్సాఫీస్ రారాజు.. మన ప్రభాస్ రాజు! ఎవరికీ అందని ఎత్తులో!!
ప్రభాస్.. ఆయనకు ఉన్న క్రేజే వేరు. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ప్రపంచ దేశాల్లో వేరే లెవెల్ ఫ్యాన్ బేస్ ఆయన సొంతం.
By: Tupaki Desk | 23 Oct 2024 6:27 AM GMTప్రభాస్.. ఆయనకు ఉన్న క్రేజే వేరు. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ప్రపంచ దేశాల్లో వేరే లెవెల్ ఫ్యాన్ బేస్ ఆయన సొంతం. రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా ఈశ్వర్ చిత్రంతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన.. వర్షం మూవీతో ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. ఆ సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేశారు. ఆ తర్వాత వరుస చిత్రాలతో సినీ ప్రియులను అలరించారు. ఇప్పటికీ అలరిస్తున్నారు.. తన అసాధారణ టాలెంట్ తో దూసుకుపోతున్నారు.
వర్షం తర్వాత ఛత్రపతితో మాస్ హీరోగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. డార్లింగ్, మిర్చి, మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రాలతో అమ్మాయిల కలల రాకుమారుడిగా మారారు. ఇక రాజమౌళి తెరకెక్కించిన బాహుబలితో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ఆ సినిమాలో ప్రభాస్ తన యాక్టింగ్, లుక్స్, రాజసంతో వేరే లెవెల్ లో అలరించారు. ఆ మూవీతో ప్రభాస్ కెరీర్.. బాహుబలి ముందు.. ఆ తర్వాత.. అన్నట్లు మారిందని చెప్పడంలో ఎలాంటి డౌట్ ఎవరికీ అక్కర్లేదు.
అయితే ప్రభాస్.. తన టాలెంట్ తో వరల్డ్ వైడ్ గా కోట్లాది మంది అభిమానుల మనసులు గెలుచుకోవడమే కాకుండా.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఒకరిగా నిలిచారు. ఒక సాధారణ నటుడిగా కెరీర్ మొదలు పెట్టి ఎంతో హార్డ్ వర్క్ తో పాన్ ఇండియా స్టార్ గా మారారు. అదే సమయంలో అనేక సార్లు తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఉదారంగా విరాళాలు ఇచ్చారు. విపత్తుల సమయంలో అండగా నిలిచి ఎంతో మందిలో స్ఫూర్తి నింపారు.
ఇటీవల సలార్, కల్కి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ రూ.1000 కోట్ల హిట్స్ కొట్టిన ప్రభాస్.. ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కే సలార్, కల్కి 2లో నటించనున్నారు. దీంతో ఇంకెన్ని కొత్త రికార్డులు సృష్టిస్తారోనని అంతా వెయిట్ చేస్తున్నారు. అయితే బాహుబలి మూవీతో బాక్సాఫీస్ రారాజుగా మన ప్రభాస్ రాజు మారిపోయారని చెప్పాలి. రూ.1000 కోట్ల మార్క్ దాటిన రెండు చిత్రాల్లో నటించిన ఏకైక హీరోగా ప్రభాస్ రికార్డు సృష్టించి అబ్బురపరిచారు.
బాక్సాఫీస్ వద్ద ఏదైనా సినిమా రికార్డు సాధిస్తే అది బాహుబలినా లేదా నాన్ బాహుబలి రికార్డా అని పరిగణనకు తీసుకునేలా మైలు రాయిని సెట్ చేశారు. అది ఆయన టాలెంట్ ఏంటో ప్రూవ్ చేస్తుంది. ఎంత పెట్టుబడి పెట్టినా.. కేవలం కొద్ది రోజుల్లోనే ప్రభాస్ మూవీ రికవరీ చేస్తుందనే నమ్మకాన్ని మేకర్స్ లో క్రియేట్ చేసింది. మరి నేడు ఆయన బర్త్ డే సందర్భంగా.. ఫ్యూచర్ లో ప్రభాస్ మరిన్ని విజయాలు అందుకుని, ఇంకా ఎవరికీ అందని ఎత్తులో ఎదగాలని tupaki కోరుకుంటోంది!