స్పిరిట్.. సాధ్యమేనా..?
రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల లైనప్ ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి చేస్తుంది. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాలన్నీ పూర్తయ్యే సరికి ఎలా లేదన్నా ఆరేడు ఏళ్లు పట్టేలా ఉంది.
By: Tupaki Desk | 25 Feb 2025 3:00 AM GMTరెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల లైనప్ ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి చేస్తుంది. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాలన్నీ పూర్తయ్యే సరికి ఎలా లేదన్నా ఆరేడు ఏళ్లు పట్టేలా ఉంది. ప్రస్తుతం మారుతి డైరెక్షన్ లో రాజా సాబ్ చేస్తున్న ప్రభాస్ ఆ సినిమాను ఈ ఇయర్ సెకండ్ హాఫ్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత హనుతో ఫౌజీ సెట్స్ మీద ఉంది. హను రాఘవపూడి ఈ సినిమాను స్పీడ్ గా లాగించేస్తున్నాడు. ఐతే సందీప్ వంగాతో చేస్తున్న స్పిరిట్ కూడా ప్రభాస్ త్వరలో మొదలు పెడతాడని తెలుస్తుంది.
యానిమల్ తర్వాత సందీప్ వంగ చేస్తున్న సినిమాగా స్పిరిట్ మీద చాలా హోప్స్ ఉన్నాయి. ముఖ్యంగా సందీప్ వంగ సినిమాల్లో హీరోగా ప్రభాస్ ఎలా ఉంటాడా అన్న ఆలోచనే రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి నిద్ర పట్టనివ్వట్లేదు. స్పిరిట్ సినిమా త్వరలో షూటింగ్ మొదలు కాబోతుంది. ఐతే సినిమా ఎలా లేదన్నా ఏడాది పాటు చేస్తారని టాక్. అంటే 2025 మిడిల్ లో మొదలైనా 2026 చివరి దాకా పడుతుంది.
హనుతో చేస్తున్న ఫౌజీ ని కూడా నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కి పూర్తి చేసేలా ఉన్నారు. కుదిరితే 2026 ఎండింగ్ రిలీజ్ ఉంటుంది. లేదంటే 2027 కి వెళ్తుంది. సో ఎలా చూసినా కూడా 2027 లో స్పిరిట్ రిలీజ్ ఛాన్స్ ఉండేలా కనిపించట్లేదు. ప్రభాస్ సినిమాల లైనప్ వావ్ అనిపిస్తున్న వాటి రిలీజ్ ఎప్పుడు ఉంటుందా అన్న టెన్షన్ మాత్రం ఒక పక్క ఫ్యాన్స్ లో రన్ అవుతూనే ఉంది.
ప్రభాస్ ఓకే చేసిన సినిమాల లిస్ట్ ఒకసారి చూస్తే రాజా సాబ్ రిలీజ్ కు రెడీ అవుతుండగా ఫౌజీ షూటింగ్ జరుపుకుంటుంది. నెక్స్ట్ స్పిరిట్ సెట్స్ మీదకు వెళ్లేందుకు సిద్ధమవుతుంది. ఇక సలార్ 2, కల్కి 2 ఉన్నాయి. సో ఈ సినిమాలన్నీ ఎప్పుడు పూర్తి చేసి రిలీజ్ చేస్తాడా అని ఫ్యాన్స్ చర్చిస్తున్నారు. పోనీ సినిమాలు రాకున్నా వాటి అప్డేట్స్ అయినా వస్తే చాలని అనుకుంటున్న ఫ్యాన్స్ కి నిరాశ తప్పట్లేదు. రెబల్ స్టార్ తన ఫ్యాన్స్ గురించి కాస్త పట్టించుకుంటే బెటర్ అని చెబుతున్నారు. ఐతే ఈ ఇయర్ రాజా సాబ్ ద్వారా ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు రెబల్ స్టార్.