Begin typing your search above and press return to search.

ప్రభాస్ 'స్పిరిట్‌' రెండు కొత్త అప్‌డేట్స్‌!

ప్రభాస్‌ సలార్‌, కల్కి 2898 ఏడి సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకున్నాడు.

By:  Tupaki Desk   |   3 Sep 2024 9:40 AM GMT
ప్రభాస్ స్పిరిట్‌ రెండు కొత్త అప్‌డేట్స్‌!
X

ప్రభాస్‌ సలార్‌, కల్కి 2898 ఏడి సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకున్నాడు. వరుసగా రికార్డ్‌ స్థాయి వసూళ్లు సాధించిన ప్రభాస్ తదుపరి సినిమాలపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. రాజాసాబ్‌, ఫౌజీ, కల్కి 2, సలార్‌ 2 సినిమాలు ఇప్పటికే లైన్ లో ఉన్నాయి. అవే కాకుండా అర్జున్‌ రెడ్డి, యానిమల్‌ సినిమాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్‌ చేసేందుకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చాడు. ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ ప్రారంభం అయ్యింది. ఈ ఏడాది చివరి వరకు స్క్రిప్ట్‌ వర్క్ పూర్తి చేస్తానంటూ దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగ గతంలో ప్రకటించాడు.

స్పిరిట్‌ లో ప్రభాస్ ఎలా ఉంటాడు, ఎలాంటి నేపథ్యంలో సినిమా ఉంటుంది అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఇప్పటికే సినిమా గురించి పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా మరో రెండు ఆసక్తికర అప్డేట్స్ ప్రచారం జరుగుతున్నాయి. సినిమాలో ప్రభాస్ ను రెండు విభిన్నమైన పాత్రల్లో చూడబోతున్నామట. ఒక పాత్ర మరీ వైల్డ్‌ ఎలిమెంట్స్ తో కూడి ఉంటుందని, ఒక పాత్ర సాఫ్ట్‌ గా ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ఇక మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఈ సినిమా మాఫియా నేపథ్యంలో సాగబోతుందట. కథ లో ప్రభాస్ పాత్ర గతంలో ఎప్పుడూ చూడనటువంటి మాఫియా డాన్‌ గా కనిపించబోతున్నట్లు టాక్‌ వినిపిస్తోంది.

సందీప్ రెడ్డి వంగ సినిమా అనగానే వైల్డ్‌ ఎలిమెంట్స్ ఇంకా రొమాన్స్ ఎక్కువ అనే విషయాలు గుర్తుకు వస్తాయి. స్పిరిట్‌ సినిమాలోనూ ప్రభాస్ ఫ్యాన్స్ ని సర్‌ప్రైజ్ చేసే విధంగా వైల్డ్‌ యాక్షన్ సన్నివేశాలు ఇంకా రొమాంటిక్ సన్నివేశాలు ఉండబోతున్నాయి అంటూ ఇప్పటికే ప్రభాస్ సన్నిహితులు చెబుతున్నారు. సందీప్ రెడ్డి వంగ గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ స్పిరిట్ సినిమా తనకు చాలా స్పెషల్‌, తప్పకుండా ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్కరు కూడా మెచ్చే విధంగా తీయాలని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.

అన్ని అనుకున్నట్లు జరిగితే స్పిరిట్‌ సినిమా షూటింగ్‌ 2025 లో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. సినిమా ను ఏడాదిలో పూర్తి చేసి 2026 లోనే సినిమాను విడుదల చేయాలని దర్శకుడు సందీప్ వంగ భావిస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ ఉన్న బిజీ షెడ్యూల్‌ నేపథ్యంలో స్పిరిట్‌ కు ఎప్పటికి డేట్లు ఇస్తాడు అనేది తెలియాల్సి ఉంది. త్వరలోనే ప్రభాస్‌ రాసా సాబ్ విడుదలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అంతే కాకుండా సలార్‌ 2 ఇంకా కల్కి 2 సినిమాల షూటింగ్స్ విషయంలోనూ స్పష్టత రానుంది. ఇక హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న ఫౌజీ సినిమా విడుదల కూడా 2025 లో ఉండే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.