రాజా సాబ్.. ఫ్యాన్స్ తట్టుకుంటారా..?
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మారుతి డైరెక్షన్ లో రాజా సాబ్ సినిమా చేస్తున్నాడు.
By: Tupaki Desk | 16 Dec 2024 5:48 AM GMTరెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మారుతి డైరెక్షన్ లో రాజా సాబ్ సినిమా చేస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాలో మళయాల భామ మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తుంది. థ్రిల్లర్ జోనర్ లో మారుతి మార్క్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాను 2025 ఏప్రిల్ 10కి రిలీజ్ లాక్ చేశారు. సినిమాలో కథ కథనాలతో పాటు గ్రాఫిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అని తెలుస్తుంది.
ఐతే రాజా సాబ్ సినిమా రిలీజ్ విషయంలో డౌట్లు మొదలయ్యాయి. సినిమా రిలీజ్ కు ఇంకా ఐదు నెలలు ఉన్నా కూడా ఆ టైం కు రిలీజ్ కష్టమే అని చెబుతున్నారు. రాజా సాబ్ సినిమా ఏప్రిల్ రిలీజ్ ఫిక్స్ అనుకున్న రెబల్ ఫ్యాన్స్ కి త్వరలోనే సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ న్యూస్ షాక్ ఇవ్వబోతుంది. సినిమాను ఎక్కడ టార్గెట్ మిస్ అవ్వకుండా తెరకెక్కించే క్రమంలో మేకర్స్ కాస్త టైం తీసుకోవాలని నిర్ణయించుకున్నారని తెలుస్తుంది.
రాజా సాబ్ సినిమా లో ప్రభాస్ వెరైటీ గెటప్ లో కనిపించనున్నారు. సినిమా ఆడియన్స్ కు నిజంగానే ఒక థ్రిల్ చేస్తుందని అంటున్నారు. మామూలుగానే కామెడీ మీద మంచి పట్టు ఉన్న మారుతి ప్రభాస్ తో ఒక సీట్ ఎడ్జ్ కూర్చుని చూసే ఒక థ్రిల్లర్ సినిమాగా రాజా సాబ్ ని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ కూడా వేరే లెవెల్ లో ఉంటుందని అంటున్నారు.
ఈ సినిమా తర్వాత మారుతి కూడా పాన్ ఇండియా డైరెక్టర్స్ లిస్ట్ లో చేరుతాడని అంటున్నారు. మారుతి ప్రభాస్ అసలు ఎవరు ఊహించని ఈ కాంబోలో రాబోతున్న రాజా సాబ్ నేషనల్ లెవెల్ లో ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుందని చెబుతున్నారు. సినిమాలో ప్రభాస్ లుక్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఇవన్నీ రెబల్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులను అలరిస్తాయని అంటున్నారు.
ప్రభాస్ ఈ సినిమా తో పాటు హను రాఘవపుడితో ఫౌజి చేస్తున్నాడు. మరోపక్క సందీప్ వంగాతో స్పిరిట్ సినిమాను కూడా చేస్తున్నాడు. ఈ సినిమాలతో పాటు కల్కి 2, సలార్ 2 సినిమాలు చేయాల్సి ఉంది. సినిమాల జాబితా ఓకే కానీ సినిమాల రిలీజ్ విషయంలో మాత్రం మేకర్స్ ఫ్యాన్స్ ని డిజప్పాయింట్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఏప్రిల్ లో రాజా సాబ్ రాకపోతే మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ మేకర్స్ మీద ఎటాక్ చేసే ఛాన్స్ కచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు.