ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!
'సలార్', 'కల్కి 2898' విజయాలతో డార్లింగ్ ప్రభాస్ పుల్ స్వింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 6 Dec 2024 11:30 AM GMT'సలార్', 'కల్కి 2898' విజయాలతో డార్లింగ్ ప్రభాస్ పుల్ స్వింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. అప్పటి వరకూ వరుస పరాజయాలు కాస్త ఇబ్బంది పెట్టినా రెండు విజయాలతో? రెట్టించిన ఉత్సాహంలో ఉన్నాడు. తదుపరి `రాజాసాబ్` తోనూ హిట్ కొట్టి హ్యాట్రిక్ స్టార్ గా అవతరించాలని ప్లాన్ చేస్తున్నాడు. మారుతి దర్శకత్వం వహిస్తోన్న `రాజాసాబ్` పై కూడా మంచి అంచనాలున్న సంగతి తెలిసిందే. పక్కా కమర్శియల్ ఎంటర్ టైనర్ కావడంతో? తిరుగులేదనే టాక్ వినిపిస్తుంది.
ఇప్పటికే రిలీజ్ అయిన ప్రభాస్ లుక్ సహా ప్రతీది మంచి బజ్ తీసుకొచ్చింది. దీంతో రిలీజ్ తేది కోసం ప్రేక్షకాభి మానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. ఆ తేదీ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. సమ్మర్ లో కూల్ హిట్ అవుతుందని అభిమానులు ఎదురు చూస్తు న్నారు. అయితే ఈ సినిమా సమ్మర్ కి రావడం కష్టమని తాజాగా వినిపిస్తుంది. జనవరి నాటికి చిత్రీకరణ ముగించే దిశగా యూనిట్ జర్నీ సాగిస్తుంది.
అటుపై సంక్రాంతి సందర్భంగా తొలి పాటను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. చిత్రీకరణ ముగింపు దశకు చేరుకున్నా? పోస్ట్ ప్రొడక్షన్ సహా ప్యాచ్ వర్క్ కారణంగా ఏప్రిల్ రిలీజ్ ఉండకపోవచ్చు అని బలంగానే విని పిస్తుంది. ఇదే జరిగితే డార్లింగ్ అభిమానులకు మళ్లీ నిరాశ తప్పదు. ఇప్పటికే సినిమా చాలా కాలంగా సెట్స్ లో ఉంది అనే విమర్శ ఉంది. చిన్న సినిమా అయినా వేగంగా ఎందుకు పూర్తవ్వడం లేదనే విమర్శలు వ్యక్తమ వుతున్నాయి.
ప్రభాస్ కూడా ఈ సినిమా కోసం పూర్తి స్థాయిలో డేట్లు కేటాయించకపోవడం కూడా ఆలస్యానికి ఓ కారణంగా చాలా కాలంగానే వినిపిస్తుంది. లైనప్ లో భారీ బడ్జెట్ సినిమాల షూటింగ్ కూడా జరగడంతో డార్లింగ్ రాజాసాబ్ కి డేట్లు కేటాయించడంలోనూ జాప్యం జరుగుతుంది. వెరసీ అవన్నీ రిలీజ్ పై ప్రభావం చూపిస్తున్నాయి.