కన్నప్ప....ప్రభాస్ లేటెస్ట్ లుక్కు చూశారా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నారో అందరికీ తెలిసిందే. వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
By: Tupaki Desk | 27 Feb 2025 10:09 AM GMTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నారో అందరికీ తెలిసిందే. వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. నాన్ స్టాప్ షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. గత ఏడాది కల్కి 2898 ఏడీ మూవీతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ప్రభాస్.. ఇప్పుడు మోస్ట్ బిజీయెస్ట్ హీరో అనే చెప్పాలి.
ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ది రాజా సాబ్ చేస్తున్న ప్రభాస్.. హను రాఘవపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఫౌజీ (ప్రచారంలో ఉన్న టైటిల్)లో నటిస్తున్నారు. ఆ రెండు సినిమాల షూటింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయి. 2025లో రాజా సాబ్ మూవీ కచ్చితంగా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. దసరాకు రిలీజ్ అవుతుందట.
వాటితోపాటు సలార్ పార్ట్ 2: శౌర్యంగపర్వం, కల్కి 2898 ఏడీ పార్ట్ 2 సినిమాలు కూడా ప్రభాస్ లైనప్ లో ఉన్నాయి. ప్రశాంత్ వర్మతో బ్రహ్మా రాక్షస్ సినిమాకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇప్పుడు జోరుగా ప్రచారం సాగుతోంది. వీటిన్నింటితోపాటు కన్నప్ప మూవీలో గెస్ట్ రోల్ లో ప్రభాస్ కనిపించనున్న విషయం తెలిసిందే.
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా రూపొందుతున్న ఆ సినిమాలో డార్లింగ్.. కీలక పాత్రలో నటించనున్నారు. పలువురు పాన్ ఇండియా నటులతోపాటు ఆయన కూడా భాగమయ్యారు. రుద్రా అనే పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్నారు. ఇప్పటికే ఆయనకు సంబంధించిన ఫస్ట్ లుక్.. కొద్ది రోజుల క్రితం రిలీజై మంచి రెస్పాన్స్ అందుకుంది.
కొందరు మాత్రం కాస్త భిన్నమైన స్పందన వ్యక్తం చేసినా.. ఎక్కువ మంది మాత్రం ప్రభాస్ రుద్రా లుక్ ను ప్రశంసించారు. అయితే ఇప్పుడు మరో పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ రేంజ్ లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కొత్త స్టిల్ లో డీసెంట్ గా కనిపిస్తున్నారు ప్రభాస్.
ప్రభాస్ కొత్త పోస్టర్ అదిరిపోయిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. సూపర్ పోస్టర్ అంటూ వైరల్ చేస్తున్నారు. అయితే ఏప్రిల్ 25వ తేదీన పాన్ ఇండియా లెవెల్ లో కన్నప్ప మూవీని రిలీజ్ చేస్తామని మేకర్స్ తెలిపారు. ప్రమోషన్స్ లో భాగంగా మార్చి 1వ తేదీన టీజర్ ను లాంచ్ చేయనున్నారు. మరి కన్నప్ప మూవీ ఎలా ఉంటుందో.. ప్రభాస్ తన రోల్ లో ఎలా మెప్పిస్తారో వేచి చూడాలి.